Sports Bikes Cheaper Than Iphone 13: టూ వీలర్ ఇండస్ట్రీకి భారత్ అతిపెద్ద మార్కెట్. గత కొన్నేళ్ల గణాంకాలను గమనిస్తే భారత్‌లో ప్రతీ ఏటా 20 మిలియన్ యూనిట్ల బైక్స్ అమ్ముడుపోతున్నాయి. అయితే ఒకప్పటిలా కేవలం 110 సీసీ, 125 సీసీ బైక్స్ మాత్రమే కాకుండా 150 సీసీ, 200 సీసీ బైక్స్‌కి ఇప్పుడు డిమాండ్ బాగా పెరిగింది. ముఖ్యంగా యువత స్పోర్ట్స్ బైక్స్ పట్ల ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే స్పోర్ట్స్ బైక్స్ ధరలు కూడా అందుకు తగ్గట్లే ఉండటంతో వాటి కొనుగోలుకు భారీ మొత్తంలో వెచ్చించాల్సి వస్తోంది. ఇక్కడ ఒక ముఖ్య విషయం గమనించాలి. యాపిల్ ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ (512 జీబీ)కు వెచ్చించే ధరతో ప్రస్తుత ఇండియన్ టూ వీలర్ మార్కెట్‌లో 5 స్పోర్ట్స్ బైక్స్ అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ ధర రూ.1.50 లక్షలు కాగా, అంతకన్నా తక్కువ ధరలో అందుబాటులో ఉన్న స్పోర్ట్స్ బైక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం...
యమహా ఎంటీ15 :
నేక్డ్ స్పోర్ట్స్ బైక్ కేటగిరీకి చెందిన బైక్స్ విక్రయాల్లో ఇండియాలో యమహా 15 బైక్ ముందు వరుసలో ఉంది. ప్రీమియం సెగ్మెంట్‌లోని వినియోగదారులను ఆకట్టుకునే MT DNAని ఇది కలిగి ఉంటుంది. ఇందులో మల్టీ ఫంక్షన్ నెగటివ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, యునిక్ బై-ఫంక్షనల్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్స్ ఉన్నాయి. ఇందులో ఉండే 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 13.6 కిలో వాట్స్ పవర్ జెనరేషన్‌తో 6500 ఆర్‌పీఎం వద్ద గరిష్టంగా దీని టార్క్ 16.45 ఎన్ఎంగా ఉంటుంది. దీని ధర ప్రస్తుతం దీని ధర ఇండియాలో రూ.1,46,900గా ఉంది.
హీరో ఎక్స్‌ట్రీమ్ 200S:
స్పోర్ట్స్ బైక్ లుక్‌తో ఇండియన్ మార్కెట్‌లో లభిస్తున్న బైక్స్‌లో మరో బెస్ట్ అండ్ చీప్ కాస్ట్‌లో అందుబాటులో ఉన్న బైక్ హీరో ఎక్స్‌ట్రీమ్ 200S. బ్లూటూత్ కనెక్షన్‌తో కూడిన ఫుల్ డిజిటల్ ఎల్‌సీడీ స్క్రీన్ ఫీచర్ ఇందులో ఉంది. ఇందులో ఉండే 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 13.3 కిలో వాట్స్ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6500 ఆర్‌పీఎం వద్ద గరిష్టంగా దీని టార్క్ 16.45 ఎన్ఎం. దీని ధర ప్రస్తుతం రూ.1,28,614గా ఉంది.
బజాజ్ పల్సర్ N250:
నేక్డ్ స్పోర్ట్స్ బైక్ కేటగిరీలో చౌక ధరలో అందుబాటులో ఉన్న మరో బైక్ బజాజ్ పల్సర్ N250. యూఎస్‌బీ ఫోర్ట్, గేర్ ఇండికేటర్, డిజిటల్, అనలాగ్ క్లస్టర్స్ వంటి ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. ఇందులోని 4 స్ట్రోక్ ఇంజిన్ నుంచి 18 కిలో వాట్స్ పవర్ జెనరేషన్‌తో 6500 ఆర్‌పీఎం వద్ద గరిష్ట టార్క్ 21.5గా ఉంటుంది. దీని ధర రూ.1,39,117గా ఉంది.
సుజుకి గిక్సర్ ఎస్ఎఫ్ :
సుజుకి గిక్సర్‌లో చాలా వెర్షన్స్ ఉన్నప్పటికీ ఇక్కడ గిక్సర్ ఎస్ఎఫ్ గురించి ఇప్పుడు చెప్పబోతున్నాం. ఇది స్పోర్ట్స్ బైక్ లుక్‌ను కలిగి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో ఉంటుంది. ఇందులో ఉండే 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 10 కిలో వాట్స్ పవర్‌తో 6000 ఆర్‌పీఎం వద్ద గరిష్ట టార్క్ 13.8ఎన్‌ఎంగా ఉంటుది. దీని ధర రూ.1,35,000.
హోండా హార్నెట్ :
జపాన్ ప్రొడక్ట్ హోండా హార్నెట్ 2.0 కూడా ఐఫోన్ కన్నా తక్కువ ధరలో అందుబాటులో ఉన్న స్పోర్ట్స్ బైక్. ఎల్‌సీడీ స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. ఇది 4 స్ట్రోక్ ఇంజిన్‌తో 12.7 కిలో వాట్స్ పవర్ జనరేషన్‌తో 6000 ఆర్‌పీఎం వద్ద గరిష్ఠ టార్క్ 16.1గా కలిగి ఉంది. దీని ధర రూ.1,34,238.
Also Read: MLA Roja: ఎమ్మెల్యే రోజా కీలక నిర్ణయం.. జబర్దస్త్‌కు గుడ్‌బై.. ఇకపై ఏ షూటింగ్స్ చేయనని క్లారిటీ..
Amazon Tecno Pop 5 LTE: రూ.9 వేల విలువైన స్మార్ట్ ఫోన్ ను రూ.349లకే కొనేయండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook