Flipkart Highest Sale: ఈ కామర్స్ వేదికలు అందుబాటులో వచ్చాక క్రయ విక్రయాలు పెరిగాయనేది వాస్తవం. అదే సమయంలో స్మార్ట్‌ఫోన్ల్ విషయంలో ఒక బ్రాండ్ ఫోన్ అమ్మకాలు భారీగా పెరిగాయట. ఆ వివరాలు మీ కోసం..
ఆన్‌లైన్ షాపింగ్ బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఫ్లిప్‌కార్డ్, అమెజాన్ వంటి ఆన్‌లైన్ షాపింగ్ వేదికలకు ప్రాచుర్యం ఎక్కువైంది. స్మార్ట్‌ఫోన్ కొనాలంటే చాలు అమెజాన్ లేదా ఫ్లిప్‌కార్ట్‌లను ఆశ్రయిస్తుంటారు. ప్రత్యేకించి ఈ రెండింట్లో ఆఫర్లు, లేదా సేల్ నడుస్తున్నప్పుడు. ఇటీవల జరిగిన ఫ్లిప్‌కార్ట్ ఇండిపెండెన్స్ డే ఫెస్టివల్‌లో పెద్దఎత్తున స్మార్ట్‌ఫోన్, గ్యాడ్జెట్స్ అమ్మకాలు ఎక్కువయ్యాయి. ఈ అమ్మకాల తరువాత ఫ్లిప్‌కార్ట్ జారీ చేసిన డేటా ప్రకారం ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి. ఎక్కువగా ఏ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్ కొనుగోళ్లు జరిగాయో ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది.
సాధారణంగా స్మార్ట్ ఫోన్లంటే యాపిల్ లేదా శాంసంగ్‌ను ఎక్కువగా జనం ఇష్టపడుతుంటారు. లేదా మూడవ స్థానంలో షియోమీ ఫోన్లుంటాయి. కానీ ఫ్లిప్‌కార్ట్ విడుదల చేసిన డేటా ప్రకారం ఈ మూడు బ్రాండ్ల కంటే పోకో ముందంజలో ఉంది. ఎక్కువమంది ఇష్టపడింది, కొనుగోలు చేసింది కూడా పోకో స్మార్ట్‌ఫోన్ అని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. కేవలం ఆగస్టు 6 నుంచి 10వ తేదీ మధ్యన జరిగిన ఫ్లిప్‌కార్డ్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఈ బ్రాండ్ ఫోన్లు ఎక్కువగా విక్రయమయ్యాయి.
ఈ సేల్‌లో అన్ని స్మార్ట్‌ఫోన్లలో పోకో సి31 ఎక్కువగా అమ్ముడైంది. ముఖ్యంగా 10-15 వేల మధ్యలో ఎక్కువగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్ పోకో ఎక్స్ 4 ప్రో. అది కాకుండా 15-20 వేల మధ్య ఎక్కువగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్ పోకో ఎం4 ప్రోగా తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా పోకో కంపెనీ కూడా వెల్లడించింది. పోకో కంపెనీ ట్విట్టర్ వేదికపై ఈ విషయాన్ని తెలిపింది. ఫ్లిప్‌కార్డ్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో పోకో స్మార్ట్‌ఫోన్లు అత్యధికంగా అమ్ముడయ్యాయని తెలిపింది.
Also read: Digital Gold: ఆన్‌లైన్ డిజిటల్ గోల్డ్ విక్రయాలు ఎలా చేయాలి, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ఎలా పొందాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook