Money Value vs Inflation: ఇప్పుడున్న రోజుల్లో 1 కోటి రూపాయలు అంటే చాలా పెద్దమొత్తం. ఇదే పరిస్థితి భవిష్యత్తులో ఉంటుందా అంటే ఉండదనే సమాధానం వస్తోంది. ఎందుకంటే ఒకప్పుడు మారిన నగదు ఇప్పుడు మారడం లేదు. మొన్నటి 100 రూపాయలకు ఇప్పుడు 500 రూపాయలతో సమానమయ్యాయి. మరి ఇప్పుడున్న కోటి రూపాయలు 30 ఏళ్ల తరువాత ఎంత విలువ కలిగి ఉండవచ్చో పరిశీలిద్దాం
గతంలో చిన్నప్పుడు 5 పైసలు, 10 పైసలు, పావలా, అర్ధ రూపాయి మారేవి. మార్చుకుని ఖర్చు చేసిన రోజులున్నాయి. అంతకంటే ముందు 2 పైసలు, బేడా, అర్ధణాలుండేవి. ఆ సమయంలో 1 రూపాయి అంటే చాలా చాలా ఎక్కువ. 100 రూపాయలంటే ఇవాళ్టి లక్ష రూపాయలతో సమానం కావచ్చు. ఇదంతా 40 ఏళ్ల క్రితం మాట. కాలం గడిచేకొద్దీ మారకం విలువ మారిపోతోంది. క్రమంగా రూపాయి కూడా కనుమరుగు కావచ్చు. రూపాయిల చెలామణీలో ఉంది కానీ విలువ పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు 500 మారిస్తే సాయంత్రానికి ఉండటం లేదు.
ఇప్పటి రోజుల్లో 1 కోటి రూపాయలు అంటే చాలా పెద్దమొత్తమే. ఇదే 1 కోటి రూపాయలు 15 ఏళ్లు, 20 ఏళ్లు, 30 ఏళ్ల తరువాత ఎంత విలువ చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇప్పుడున్న 1 కోటి రూపాయలు 30 ఏళ్ల తరువాత 17 లక్షలతో సమానం అవుతుందంటున్నారు ఆర్ధిక నిపుణులు. ఆ సమయంలో 17 లక్షలు సరిపోతాయా మరి అంటే చాలవనే చెప్పాలి. మరి 30 ఏళ్ల తరువాత రిటైర్ అయ్యే వ్యక్తులకు ఆ డబ్బు సరిపోతుందా. ఇళ్లు కొనగలరా, పిల్లల చదువుకు డబ్బులు సరిపోతాయా, హాయిగా శేష జీవితాన్ని గడపగలరా అనే ప్రశ్నలు ఆందోళన కల్గిస్తుంటాయి.
ద్రవ్యోల్బణం ప్రభావంతో డబ్బు విలువ తగ్గిపోతోంది. అంటే ఇప్పుడు ఒక కారు ఖరీదు 10 లక్షలు అనుకుంటే 15 ఏళ్ల తరువాత అది కాస్తా పెరిగిపోతుంది. 20 లక్షలు కావచ్చు. అదే విధంగా ఇంటి అద్దె, ఆహారం ఖర్చు కూడా 10-15 ఏళ్ల క్రితంతో పోలిస్తే చాలా ఎక్కువ. అప్పట్లో చాలా తక్కువగా ఉండేది. ద్రవ్యోల్బణం అనేది డబ్బు విలువను తగ్గిస్తోంది.
ద్రవ్యోల్బణం రేటు 6 శాతం అలాగే ఉంటే పదేళ్ల తరువాత 1 కోటి రూపాయలు అంటే 55.84 లక్షలతో సమానమవుతుంది. అదే 20 ఏళ్ల తరువాత 31.18 లక్షలతో సమానం. అదే 30 ఏళ్ల తరువాత 17.41 లక్షలతో సమానం కాగలదు. ద్రవ్యోల్బణం కారణంగా డబ్బు విలువ క్రమంగా తగ్గిపోతోంది. అందుకే రిటైర్మెంట్ ప్లానింగ్ పెంచుకోవల్సి ఉంటుంది. చాలామంది ఇప్పటి లెక్కల ప్రకారం భవిష్యత్తు ప్లాన్ చేసుకుంటారు. కానీ ఇది సరైన విధానం కాదు. భవిష్యత్తు అంచనాల ప్రకారం రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకోవాలి. అంటే ద్రవ్యోల్బణాన్ని పరిగణలో తీసుకోవాలి.
ద్రవ్యోల్బణం ప్రభావం తగ్గించాలంటే అధిక రిటర్న్స్ అందించే పథకాల్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. స్టాక్ మార్కెట్, మ్యూచ్యువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ వంటివి బెస్ట్ ఆప్షన్లు. ఎందుకంటే ఇప్పుడు కోటి రూపాయలు 30 ఏళ్ల తరువాత పెద్ద విలువ చేయవు.
Also read: Budameru Floods: చూపులేనిది బుడమేరుకా, ప్రభుత్వానికా, అసలేం జరిగింది, ఎందుకీ విపత్తు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Money Value vs Inflation: ఇప్పుడు 1 కోటి రూపాయలు 30 ఏళ్ల తరువాత ఎంత అవుతుందో తెలుసా