ITR Filing: ఐటీ రిటర్న్స్ కు మరో రెండు రోజులే మిగిలింది, ఏయే డాక్యుమెంట్లు అవసరం

ITR Filing: ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు మరో రెండు రోజులే గడువు మిగిలింది. ఇప్పటికీ మీరు రిటర్న్స్ ఫైల్ చేయకుంటే వెంటనే పూర్తి చేయండి. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు ఏయే డాక్యుమెంట్లు అవసరమో తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 29, 2024, 12:52 PM IST
ITR Filing: ఐటీ రిటర్న్స్ కు మరో రెండు రోజులే మిగిలింది, ఏయే డాక్యుమెంట్లు అవసరం

How To File ITR in Telugu: ఇన్ కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు చివరి రోజు జూలై 31. అంటే మరో రెండు రోజులే ఉంది. 2023-24 ఆర్ధిక సంవత్సరం, 2024-25 అసెస్ మెంట్ కు సంబంధించిన రిటర్న్స్ వెంటనే పైల్ చేయండి. లేకపోతే జరిమానాతో ఫైల్ చేయాల్సి ఉంటుంది. చివరి రెండు రోజులే మిగలడంతో రిటర్న్స్ కు కావల్సిన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోండి.

ఇన్ కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశారా. చేయకుంటే వెంటనే ఆ ప్రక్రియ పూర్తి చేయండి. మరో రెండు రోజులు అంటే జూలై 31 వరకూ గడువు ఉంది. ఈ క్రమంలో రిటర్న్స్ ఫైల్ చేసేందుకు కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు అవసరమౌతాయి. ఇ ఫైలింగ్ పోర్టల్ www.incometax.gov.inలో అప్లై చేసే ముందే ఈ డాక్యుమెంట్లు సిద్ధం చేసుకుంటే రిటర్న్స్ ప్రక్రియ సులభతరమౌతుంది. ఇప్పటి వరకూ 5 కోట్లకు పైగా ట్యాక్స్ పేయర్లు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారు. 

ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు అవసరమైన డాక్యుమెంట్లు

1. బ్యాంక్ టీడీఎస్ సర్టిఫికేట్
2. బ్యాంక్ ఎక్కౌంట్ వివరాలు
3. ఆధార్ కార్డు, పాన్ కార్డు
4. ఫామ్ 16
4. గతంలో దాఖలు చేసిన ట్యాక్స్ రిటర్న్స్
5. శాలరీ స్లిప్
6. రెంటల్ అగ్రిమెంట్
7. ఫారిన్ బ్యాంక్ వివరాలు
8. విదేశీ పెట్టుబడుల వివరాలు

ఐటీ డిడక్షన్ కు అవసరమైనవి

ఇన్ కంటాక్స్ చట్టం సెక్షన్ 80సి, 80సిసిడి ప్రకారం ఈఎల్ఎస్ఎస్ పెట్టుబడుల ప్రూఫ్, నేషనల్ పెన్షన్ స్కీమ్ ప్రూఫ్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం రిసీప్టులు, హెల్త్ ఇన్సూరెన్స్ రిసీప్టు, ఎడ్యుకేషన్ లోన్ అయితే బ్యాంకు నుంచి ఇంట్రస్ట్ సర్టిఫికేట్, సెక్షన్ 24బి డిడక్షన్ కోసమైతే బ్యాంకు నుంచి ఇంట్రస్ట్ సర్టిఫికేట్, సెక్షన్ 80జి ప్రకారమైతే విరాళాల రిసీప్టులు.

కేపిటల్ గెయిన్స్ లేదా లాస్ కు సంబంధించి మ్యూచువల్ ఫండ్, ఇంటి కొనుగోలు, అమ్మకాలు, స్టాక్ మార్కెట్ షేర్ల వివరాలు, బ్యాంక్ ఎక్కౌంట్ టీడీఎస్ వివరాలు, వర్చువల్ డిజిటల్ అసెట్స్ వివరాలు ఆదాయం సోర్స్ గురించి అవసరమౌతాయి. ఈ వివరాలకు సంబంధించి ఏవి అవసరమో అవి సిద్దం చేసుకోవాలి.

Also read: Pan Card Misuse: పాన్ కార్డుతో భారీ మోసాలు, మీ పాన్ కార్డు ఎంత వరకూ భద్రమో ఇలా చెక్ చేసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News