iPhone 13 Pro Max: బంపరాఫర్... ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్‌పై రూ.48 వేల తగ్గింపు..

iPhone 13 Pro Max for Low Price: మీరు యాపిల్ ఐఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా... అయితే 'స్ప్రింట్‌'లో మీకోసం భారీ తగ్గింపు ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.  

Written by - Srinivas Mittapalli | Last Updated : Jul 19, 2022, 01:53 PM IST
  • ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్‌పై భారీ తగ్గింపు
  • ఎక్స్‌చేంజ్ ఆఫర్ అందిస్తున్న స్ప్రింట్
  • పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి
iPhone 13 Pro Max: బంపరాఫర్... ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్‌పై రూ.48 వేల తగ్గింపు..

iPhone 13 Pro Max for Low Price: ఆండ్రాయిడ్, ఐఫోన్.. ఈ రెండింటిలో ఏది మీ ఛాయిస్ అంటే చాలామంది యాపిల్ అని చెబుతారు. అయితే ధర కారణంగా చాలామంది యాపిల్ ఐఫోన్ కొనుగోలుకు వెనుకాడుతారు. అయితే ఈకామర్స్ సంస్థలు అందించే ఆఫర్స్ ద్వారా యాపిల్ ఐఫోన్స్‌ని కూడా చౌక ధరకే సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం ప్రముఖ ఈకామర్స్ సైట్ స్ప్రింట్‌లో ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్‌పై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. త్వరలో ఐఫోన్ 14 లాంచ్ అవుతున్న నేపథ్యంలో ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్‌పై తగ్గింపును ప్రకటించింది స్ప్రింట్. ఈ ఆఫర్ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

స్ప్రింట్‌లో భారీ తగ్గింపు ఆఫర్ :

ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ లాంచింగ్ ధర 1099 డాలర్లు. ప్రస్తుతం స్ప్రింట్‌లో దీనిపై ఎక్స్‌చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ ద్వారా 600 డాలర్ల వరకు తగ్గింపు పొందుతారు. అయితే ఎక్స్‌చేంజ్ కోసం మీరు ఇచ్చే ఫోన్‌పైనే తగ్గింపు ఆధారపడి ఉంటుంది. మీ ఫోన్‌ కండిషన్‌ని స్ప్రింట్ మొబైల్ ఎక్స్‌పర్ట్ పరిశీలిస్తారు. దాని కండిషన్‌ని బట్టి ఎక్స్‌చేంజ్ ధరను నిర్ణయిస్తారు. ఒకవేళ పూర్తి ఎక్స్‌చేంజ్ ఆఫర్ లభిస్తే రూ.48 వేలు వరకు ఆదా అవుతుంది. ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్‌లో 128 జీబీ, 256 జీబీ 512 జీబీతో కూడిన ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటిపై ఎక్స్‌చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ పొందాలంటే స్ప్రింట్ సైట్‌లోకి లాగిన్ అయి ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. 

ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ ఫీచర్స్ :

6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే
నైట్ మోడ్‌తో కూడిన 12 మెగా పిక్సెల్ ట్రూడెప్త్ ఫ్రంట్ కెమెరా
4కె డాల్బీ విజన్ హెచ్‌డీఆర్ రికార్డింగ్
ఏ15 బయోనిక్ చిప్
22 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ సామర్థ్యం
డ్యురెబుల్ డిజైన్, సిరామిక్ షీల్డ్

 

Also Read: Rupee Drops: రూపాయి ఢమాల్.. చరిత్రలో తొలిసారిగా 80కి పతనమైన దేశీ కరెన్సీ...  

Also Read: Acharya: ఆచార్యను వెంటాడుతున్న కష్టాలు... మరో ఘోర పరాభవం?

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News