Property: ఒక్కోసారి మీరు ప్రాపర్టీని విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరో మంచి నివాస స్థలానికి బదిలీ అవ్వాల్సి వచ్చినప్పుడు,లేదా మీకు ట్రాన్స్ ఫర్, లేదా విదేశాల్లో ఉద్యోగం వచ్చినప్పుడు మీరు ప్రాపర్టీ నుంచి మూవ్ అవ్వాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో మీ ప్రాపర్టీకి మంచి వ్యాల్యూ దక్కాలంటే కింద పేర్కొన్నటువంటి ఐదు విషయాల పైన దృష్టి సారించాల్సి ఉంటుంది. అప్పుడు మీరు పెట్టిన పెట్టుబడిపై మంచి రాబడి రిటర్న్ కావాలంటే, ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మార్కెట్ ప్రకారం ప్రాపర్టీ ధర నిర్ణయించుకోండి:
ఒక్కోసారి మంచి కండిషన్‌లో ఉండి, మంచి లొకేషన్‌లో ఉన్నప్పటికీ ప్రాపర్టీ ని విక్రయించడం సాధ్యం కాదు. మార్కెట్ ప్రకారం ఆ ప్రాపర్టీ ధర నిర్ణయించకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. మీ ప్రాపర్టీ ధరను ప్రస్తుత మార్కెట్ ధర కంటే తక్కువ ధరను ఉంచినట్లయితే, మీ మీకు నష్టం కలుగుతుందని గుర్తుంచుకోండి. మరోవైపు, మీరు ఎక్కువ ధరను నిర్ణయిస్తే, మీరు కస్టమర్లను పొందడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. సరైన ధరను నిర్ణయించడానికి చుట్టుపక్కల ప్రార్టీల వేల్యూ ఎంత ఉందో తెలుసుకోవడం ముఖ్యమైన విషయం.
అవసరమైన డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోండి :
ప్రాపర్టీ అమ్మకంలో డాక్యుమెంట్లు సరిగ్గా ఉండటం చాలా ముఖ్యం. పేపర్లలో సమస్య లేకపోతే ప్రాపర్టీ ని సులభంగా అమ్మవచ్చు. ప్రాపర్టీ ని విక్రయించడానికి, మీరు అసలు సేల్ డీడ్ కలిగి ఉండాలి. ఇది కాకుండా, మీరు ఏదైనా డెవలప్‌మెంట్ అథారిటీ నుండి ప్రాపర్టీ ని తీసుకున్నట్లయితే, మీరు దాని అలాట్ మెంట్ లేఖను కలిగి ఉండాలి. మీరు గృహ రుణం తీసుకొని ఆ ప్రాపర్టీ ని కొనుగోలు చేసి, ఆ రుణం తిరిగి చెల్లించబడితే, మీరు పూర్తిగా రుణాన్ని తిరిగి చెల్లించినట్లు వ్రాసిన బ్యాంక్ జారీ చేసిన NOC లేఖను కలిగి ఉండాలి. ఇది కాకుండా, మీరు ఆ ప్రాపర్టీ ని తనఖా పెట్టి ఏదైనా రుణం తీసుకున్నట్లయితే, దానికి సంబంధించిన పత్రాలు కూడా ఉండాలి.
ఎక్కువ మంది కస్టమర్లకు తెలిసేలా ప్రయత్నించండి:
ప్రాపర్టీ విక్రయం కోసం, మీరు దాని సమాచారాన్ని వీలైనంత ఎక్కువ మందికి తెలియజేయడానికి ప్రయత్నించడం ముఖ్యం. దీని కోసం మీరు రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే ఏజెంట్ల సహాయం తీసుకోవచ్చు. ఇది కాకుండా మీరు ఆన్‌లైన్ రియల్టీ పోర్టల్‌లను ఉపయోగించవచ్చు. ప్రస్తుతం అనేక రియల్టీ పోర్టల్స్ ఉచితంగా ప్రాపర్టీ లిస్టింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. మీరు ఈ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించి మంచి కస్టమర్లను సులభంగా కనుగొనవచ్చు.
Also Read : ITR Filing: జూలై 31 తర్వాత కూడా ఐటీఆర్ ఫైల్ చేసే అవకాశం.? అయితే కండీషన్స్ అప్లై..!!
ప్రాపర్టీ విక్రయించే ముందు మరమ్మతులు చేయండి:
మంచి డిమాండ్ ఉంటే మీ ప్రాపర్టీ విక్రయించడం చాలా సులభం. కానీ మీ ఇల్లు లేదా ఫ్లాటులో లోపాలు ఉంటే మాత్రం కొనుగోలుదారులు కొనేందుకు ముందుకు వెనకకు అయ్యే ప్రమాదం ఉంది. అయితే ప్రాపర్టీ కొనుగోలుదారు మీ ప్రాపర్టీ ని చూడగానే కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉండాలని మీరు కోరుకుంటే, ఆ ప్రాపర్టీ ని కాస్త రిపేర్లు చేయించండి. ఎక్కడ పెయింట్ ఊడిపోయిందో, ఎక్కడో తేమగా ఉంటే, ఎక్కడ పైపు లీకులు ఉన్నాయో గమనించి వాటిని సరిచేయండి. పెయింట్ చేయడం ద్వారా ఇంటి రూపం మారిపోతుంది.
ప్రాపర్టీ బకాయిలను క్లియర్ చేయండి :
మీ ప్రాపర్టీ ని అమ్మకానికి అందించే ముందు అన్ని బకాయిలు క్లియర్ అయ్యాయని నిర్ధారించుకోండి. ప్రాపర్టీ పన్ను, వివిధ యుటిలిటీ బిల్లులు - అన్నీ ఆ సమయానికి చెల్లించాలి. సొసైటీ మెయిన్ టెయినన్స్ కూడా చెల్లించి, దాని నుండి NOC తీసుకోవడం మర్చిపోవద్దు. దీని వల్ల మీరు తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Property Selling: మీ ప్రాపర్టీ విక్రయిస్తున్నారా? అయితే ఈ తప్పులు చేస్తే భారీ నష్టం తప్పదు..!!