Maruti Suzuki Fronx Price: మారుతి ఫ్రాంక్స్ ధరలు వచ్చేశాయి.. బేస్ వేరియంట్ ధర టాటా నెక్సాన్ కంటే చాలా తక్కువ!

Maruti Suzuki Fronx Launched for Rs 7.46 Lakh in India. దేశంలో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్రాంక్స్ కాంపాక్ట్ క్రాసోవర్ ధరలను మారుతీ సుజుకి ఇండియా  ప్రకటించింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Apr 24, 2023, 06:01 PM IST
Maruti Suzuki Fronx Price: మారుతి ఫ్రాంక్స్ ధరలు వచ్చేశాయి.. బేస్ వేరియంట్ ధర టాటా నెక్సాన్ కంటే చాలా తక్కువ!

Maruti Suzuki Fronx Launched for Rs 7.46 Lakh in India: దేశంలో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఫ్రాంక్స్' కాంపాక్ట్ క్రాసోవర్ ధరలను మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ (MSIL) ప్రకటించింది. ఈ కారు ధరలు రూ. 7.46 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. అయితే ఎక్స్-షోరూమ్ ధర రూ. 13.13 లక్షల వరకు ఉంటుంది. ఈ మోడల్ లైనప్ 5 ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది (సిగ్మా, డెల్టా, డెల్టా+, జీటా మరియు ఆల్ఫా). ఇది రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లతో వస్తుంది (1.0లీటర్ టర్బో మరియు 1.2లీ న్యాచురల్ ఆస్పిరేటెడ్). టర్బో యూనిట్ 147.6Nm టార్క్ మరియు 100.06PS శక్తిని ఉత్పత్తి చేస్తుంది. న్యాచురల్ యూనిట్ 89.73PS పవర్ మరియు 113Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఫ్రాంక్స్ కాంపాక్ట్ క్రాసోవర్ కొనుగోలుదారులకు మూడు గేర్‌బాక్స్ ఎంపికలు ఉన్నాయి. 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ మరియు 5-స్పీడ్ AMT ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. మారుతి ఫ్రాంక్ 1.2L DualJet-AMT గేర్‌బాక్స్ వేరియంట్ 22.89 kmpl వరకు మైలేజీని ఇస్తుంది. మాన్యువల్ వెర్షన్‌లో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ 21.79 కిమీ/లీ మైలేజీని ఇస్తుంది. 1.0L Boosterjet వెర్షన్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో 21.50 km/l మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో 20.01 km/l మైలేజీని అందిస్తుంది.

మారుతి ఫ్రాంక్స్ ధరలు:
# 1.2L సిగ్మా MT: రూ. 7.46 లక్షలు
# 1.2L డెల్టా MT: రూ 8.32 లక్షలు
# 1.2L డెల్టా AMT: రూ. 8.87 లక్షలు
# 1.2L డెల్టా+ MT: రూ. 8.72 లక్షలు
# 1.2L డెల్టా+ AMT: రూ. 9.27 లక్షలు
# 1.0లీ డెల్టా+ MT: రూ. 9.72 లక్షలు
# 1.0లీ జీటా MT: రూ. 10.55 లక్షలు
# 1.0లీ జీటా AT: రూ. 12.05 లక్షలు
# 1.0L ఆల్ఫా MT: రూ 11.47 లక్షలు
# 1.0L ఆల్ఫా AT: రూ. 12.97 లక్షలు
# 1.0L ఆల్ఫా MT డ్యూయల్-టోన్: రూ. 11.63 లక్షలు
# 1.0L ఆల్ఫా AT డ్యూయల్-టోన్: రూ 13.13 లక్షలు

Also Read: Unknown Facts about Sachin Tendulkar: ఫోన్‌ బిల్స్‌ కట్టలేక అంజలి ఏం చేశారంటే.. సచిన్ గురించి ఎవరికీ తెలియని 10 నిజాలు!  

Also Read: Tata Punch Sales 2023: కారు చిన్నదే అయినా జనాలు టాటా పంచ్‌నే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.. టాప్ 5 రీజన్స్ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News