Petrol Price In Hyderabad 15th July 2021: మళ్లీ మండిన పెట్రోల్ ధర, మెట్రో నగరాలలో లేటెస్ట్ రేట్లు ఇలా

Petrol Price In Hyderabad 15th July, 2021: ఓవైపు నిత్యావసరాల ధరలు మండుతుంటే, మరోవైపు పెట్రో ధరలు సైతం మండుతున్నాయి. పలు రాష్ట్రాల్లో పెట్రోల్ ఇదివరకే సెంచరీ మార్కును చేరుకోగా కొన్ని రాష్ట్రాల్లో డీజిల్ సెంచరీతో పరుగులు పెడుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 15, 2021, 09:33 AM IST
Petrol Price In Hyderabad 15th July 2021: మళ్లీ మండిన పెట్రోల్ ధర, మెట్రో నగరాలలో లేటెస్ట్ రేట్లు ఇలా

Petrol Price In Hyderabad 15th July, 2021: రెండు రోజులపాటు వాహనదారులకు స్వల్ప ఊరట కలిగించిన ఇంధన ధరలు నేడు మరోసారి పెరిగాయి. ఓవైపు నిత్యావసరాల ధరలు మండుతుంటే, మరోవైపు పెట్రో ధరలు సైతం మండుతున్నాయి. పలు రాష్ట్రాల్లో పెట్రోల్ ఇదివరకే సెంచరీ మార్కును చేరుకోగా కొన్ని రాష్ట్రాల్లో డీజిల్ సెంచరీతో పరుగులు పెడుతోంది.

పెట్రోల్ ధర గురువారం 35 చొప్పుల చొప్పున పెరగగా, డీజిల్ ధర 15 పైసల మేర పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో జులై 15న లీటర్ పెట్రోల్‌ ధర రూ. 101.54కు చేరగా, డీజిల్ ధర రూ. 89.87కు చేరుకుంది. జులై నెలలో పది పర్యాయాలు ఇంధన ధరలు పెరిగాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.54 కాగా, డీజిల్ ధర రూ.97.45కి చేరుకుంది. కోల్‌కతాలో పెట్రోల్ దర రూ.101.74, డీజిల్ ధర రూ.93.02 అయింది. దేశంలో అత్యధికంగా మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో పెట్రోల్ ధర రూ.109.89, డీజిల్ ధర రూ.98.67 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

Also Read: SBI Doorstep Banking Service: కరోనా నేపథ్యంలో ఖాతాదారులకు ఎస్‌బీఐ డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సౌకర్యం, అర్హత, ఛార్జీల పూర్తి వివరాలు

హైదరాబాద్‌లో పెట్రోల్‌పై 37 పైసలు పెరగగా, డీజిల్‌పై 18 పైసల చొప్పున పెరిగింది. నేడు లీటర్ పెట్రోల్ ధర (Petrol, Diesel Price In Hyderabad) రూ.105.52 చేరగా, డీజిల్ ధర రూ. 97.96 అయింది. విజయవాడ, గంటూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.107.70 కాగా, డీజిల్ ధర రూ.99.60కు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ (Telangana), మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, లడఖ్, పంజాబ్, తమిళనాడు, సిక్కిం, పశ్చిమ బెంగాల్, నాగాలాండ్, బిహార్, ఢిల్లీ మరియు కేరళ రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతాలలో పెట్రోల్ ధరలు సెంచరీని దాటగా, ప్రస్తుతం డీజిల్ ధరలు సెంచరీ మార్కుకు పరుగులు పెడుతున్నాయి.

Also Read: BMW R 1250 GS Price: బీఎండబ్ల్యూ కంపెనీ నుంచి 2 స్పోర్ట్స్ బైక్స్‌, ధర చూస్తే షాక్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News