PM Kisan 2023 Latest Updates: పీఎం కిసాన్‌ స్కీమ్‌ లబ్ధిదారులకు అలర్ట్.. ఈకేవైసీ ఇలా పూర్తి చేయండి

PM Kisan E KYC Online Process: పీఎం కిసాన్ స్కీమ్ లబ్ధిదారులు పథకం ప్రయోజనం పొందాలంటే ముందుగా కచ్చితంగా ఈకేవైసీని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ నెల చివరి నాటికి ప్రభుత్వం నిధులు జమ చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 9, 2023, 06:35 PM IST
PM Kisan 2023 Latest Updates: పీఎం కిసాన్‌ స్కీమ్‌ లబ్ధిదారులకు అలర్ట్.. ఈకేవైసీ ఇలా పూర్తి చేయండి

PM Kisan E KYC Online Process: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం 15వ విడత డబ్బుల కోసం ప్రస్తుతం అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. దీపావళి సందర్భంగా కేంద్ర విడుదల చేస్తుందని భావించినా.. ప్రస్తుతం ఆ సూచనలు కనిపించడం లేదు. ఈ నెల చివరినాటికి పీఎం కిసాన్ లబ్ధిదారులకు శుభవార్త అందుతుందని.. రూ.2 వేల అకౌంట్‌లలో జమ అవుతాయని ప్రచారం జరుగుతోంది. డబ్బులు జమ అవ్వాలంటే.. లబ్ధిదారులు కచ్చితంగా ఈకేవైసీ పూర్తి చేసుకుని ఉండాలి. లేకుంటే వారు పథకం ప్రయోజనాలను కోల్పోతారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకాన్ని 2019లో ప్రారంభించారు. ఈ స్కీమ్ కింద ఏడాదికి రూ.6 వేలను మూడు వాయిదాల్లో చెల్లిస్తోంది. ఇప్పటివరకు 14 విడతల్లో లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేసింది. 

ఈకేవైసీని ఇలా పూర్తి చేయండి..

==> పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ సందర్శించండి
==> రైట్ సైడ్‌లో ఉన్న హోమ్ పేజీకి దిగువన.. మీకు ఫార్మర్స్ కార్నర్ కనిపిస్తుంది
==> e-kyc అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి
==>  మీ ఆధార్ నంబర్, ఇతర అవసరమైన సమాచారాన్ని ఎంటర్ చేయండి.
==> మీ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేస్తే.. ఈ కేవైసీ కంప్లీట్ అవుతుంది.

మీరు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలంటే ఇలా..

==> అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ను సందర్శించండి
==> న్యూఫార్మర్ రిజిస్ట్రర్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి
==> అప్లై చేసుకోవడానికి లాంగ్వేజ్‌ను ఎంచుకోండి. 
==> మీరు పట్టణ ప్రాంతంలోని రైతు అయితే.. అర్బన్ ఫార్మర్ రిజిస్ట్రేషన్‌ని ఎంచుకోండి. 
==> మీరు గ్రామీణులైతే గ్రామీణ రైతు రిజిస్ట్రేషన్‌ని ఎంచుకోండి. 
==> ఆధార్ నంబర్, ఫోన్ నంబర్, రాష్ట్రం ఎంచుకోండి. 
==> మీ భూమి వివరాలను నమోదు చేయండి
==> అదేవిధంగా భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్‌, ఇతర పత్రాలు అప్‌లోడ్ చేసి.. సేవ్ బటన్‌పై క్లిక్ చేయండి. 
==> క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ OTPకి వెళ్లి సబ్మిట్ చేయండి.
==> మీ మొబైల్ నంబరుకు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేస్తే.. మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌ కంప్లీట్ అవుతుంది.

లబ్ధిదారుల స్టాటస్‌ను ఇలా చెక్ చేయండి..

==> అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ పోర్టల్‌కి వెళ్లండి.
==> పేమెంట్ సక్సెస్ ట్యాబ్‌లో ఇండియా మ్యాప్ కనిపిస్తుంది
==> రైట్ సైడ్‌లో పసుపు రంగు ట్యాబ్ 'డాష్‌బోర్డ్' కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
==> ఇప్పుడు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
==> మీరు మీ పూర్తి వివరాలను ఇక్కడ ట్యాబ్‌లో నింపాలి 
==> రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం ఎంచుకోండి.
==> ఇప్పుడు షో బటన్‌పై క్లిక్ చేయండి
==> ఆ తరువాత లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి.

Also Read: Kalabhavan Haneef: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ హాస్య నటుడు కన్నుమూత

Also Read: Reservation Bill: కులాల రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీ ఆమోదం.. ఆ రాష్ట్రంలో 75 శాతం రిజర్వేషన్లు   

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News