Vistara Airlines: విస్తారా ఎయిర్‌లైన్స్‌లో ప్రత్యేక ఆఫర్లు, డొమెస్టిక్ ఫ్లైట్ టికెట్ 1899 రూపాయలే

Vistara Airlines: ప్రముఖ విమానయాన సంస్థ విస్తారా ఎయిర్‌లైన్స్ వార్షికోత్సవ ఆఫర్ ప్రారంభమైంది. దేశీయ విమాన ధరలు కేవలం 1899 రూపాయల్నించే ప్రారంభం కానున్నాయి. ఎప్పుడు, ఎలా అనే వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 10, 2023, 11:54 AM IST
Vistara Airlines: విస్తారా ఎయిర్‌లైన్స్‌లో ప్రత్యేక ఆఫర్లు, డొమెస్టిక్ ఫ్లైట్ టికెట్ 1899 రూపాయలే

టాటా గ్రూప్‌కు చెందిన విస్తారా ఎయిర్‌లైన్స్ 8వ వార్షికోత్సవ సేల్ ప్రకటించింది. ఇందులో భాగంగా డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ప్రయాణాలపై ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్ ఇస్తోంది. ఈ డిస్కౌంట్ ధరలు ఎలా వర్తిస్తాయి, బుకింగ్ టైమింగ్స్ ఎప్పుడనేది తెలుసుకుందాం..

విస్తారా ఎయిర్‌లైన్స్ 8వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక సేల్ ప్రారంభించింది. ఈ ఆఫర్ దేశీయ, అంతర్జాతీయ విమానాలకు వర్తిస్తుంది. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలపై ప్రత్యేక డిస్కౌంట్ ఎంజాయ్ చేయాల్సిందిగా విస్తారా ఎయిర్‌లైన్స్ ఓ ట్వీట్ ద్వారా వెల్లడించింది. 8 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక డిస్కౌంట్ అందిస్తున్నామని ట్వీట్ చేసింది. సీటు ఎంపిక, అదనపు లగేజ్‌పై 23 శాతం డిస్కౌంట్ ఉందని తెలిపింది. ఇదే దేశీయ విమాన టికెట్ 1899 రూపాయలతో ప్రారంభం కానుండగా, అంతర్జాతీయ టికెట్ ధర 13,299 రూపాయలతో ప్రారంభమౌతుంది.

విస్తారా వార్షికోత్సవ సేల్ 2023 వివరాలు

1. దేశీయ విమానయానంలో ఒకవైపు టికెట్ ఎకానమీ తరగతిలో 1899 రూపాయల్నించి, ప్రీమియం ఎకానమీలో 2699 రూపాయలు, బిజినెస్ తరగతిలో 6999 రూపాయల్నించి ప్రారంభం కానుంది.

2. అంతర్జాతీయ విమానయానంలో ఢిల్లీ-ఖాట్మండూ టికెట్ ఎకానమీ తరగతి 13,299 రూపాయలు, ప్రీమియం ఎకానమీలో 16,799 రూపాయలు, బిజినెస్ తరగతిలో 43,699 రూపాయలుంటుంది.

3. విస్తారా ఎయిర్‌లైన్స్ ఎంపిక చేసిన సీటు, అదనపు లగేజ్‌పై 23 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. 

విస్తారా వార్షికోత్సవ సేల్ 2023 బుకింగ్ వివరాలు

ఈ ఆఫర్ బుకింగ్స్ జనవరి 12 రాత్రి 11.59 నిమిషాల నుంచి ప్రారంభమౌతుంది. జనవరి 23 నుంచి సెప్టెంబర్ 30 మధ్య కాలంలో ప్రయాణించవచ్చు. ఈ ఆఫర్ పొందేందుకు విస్తారా ఎయిర్‌లైన్స్ అధికారిక వెబ్‌సైట్ www.airvistara.com నుంచి బుక్ చేసుకోవచ్చు. 

ఇంతకుముందు అక్టోబర్ 2022లో ఫెస్టివ్ సేల్ సందర్భంగా విస్తారా ఎయిర్‌లైన్స్ డొమెస్టిక్, ఇంటర్నేషనల్ సేల్ ఆఫర్ ప్రకటించింది. ఇందులో డొమెస్టిక్ విమానయానం ధర ఎకానమీ తరగతి 1499 రూపాయలు కాగా ప్రీమియం ఎకానమీ 2,999 రూపాయలు, బిజినెస్ తరగతి 8,999 రూపాయలుంది. అదే సమయంలో అంతర్జాతీయ విమానయానం టికెట్ ఎకానమీలో 14,149 రూపాయలు, ప్రీమియం ఎకానమీలో 18,499 రూపాయలు, బిజినెస్ తరగతిలో 42,499 రూపాయలుంది.

Also read: TVS Metro Plus 110: టీవీఎస్ సరికొత్త బైక్‌.. సామాన్యులకు అందుబాటు ధర! సూపర్ మైలేజ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News