PM Matritva Vandana Yojana: మహిళలకు గుడ్‌న్యూస్.. నేరుగా అకౌంట్‌లోకి రూ.5 వేలు!

Pradhanmantri Matritva Vandana Yojana: మహిళలకు ప్రధాన మంత్రి మాతృ వందన యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.5 వేలను అకౌంట్‌లోకి జమ చేస్తోంది. ఈ పథకం కోసం ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఎవరు అర్హులంటే..?

Written by - Ashok Krindinti | Last Updated : Jun 18, 2023, 02:51 PM IST
PM Matritva Vandana Yojana: మహిళలకు గుడ్‌న్యూస్.. నేరుగా అకౌంట్‌లోకి రూ.5 వేలు!

How To Apply Pradhanmantri Matritva Vandana Yojana: కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. మహిళల కోసం కొత్త పథకాలను తీసుకువచ్చింది. గర్భిణీల కోసం ప్రధాన మంత్రి మాతృ వందన యోజన పథకం కూడా అందుబాటులో ఉంది. ఈ పథకం కింద గర్భిణీకి 5 వేల రూపాయలు అందజేస్తుంది. దేశవ్యాప్తంగా పిల్లలకు పోషకాహార లోపం లేకుండా, ఎలాంటి వ్యాధులు రాకుండా ఉండటానికి మహిళలకు డబ్బును పంపిణీ చేస్తుంది. ఇప్పటికే ఈ స్కీమ్‌ కింద లక్షలాది మంది మహిళలు లబ్ధిపొందారు.

అర్హతలు ఇలా..
==> గర్భిణీలకు కనీసం 19 ఏళ్లు నిండి ఉండాలి.
==> ఈ పథకంలో ఆఫ్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. లేదంటా మీ ఆశా వర్కర్‌ను సంప్రదించి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు.
==> ప్రభుత్వం రూ.5 వేల మొత్తాన్ని 3 వాయిదాలలో చెల్లిస్తుంది.
==> ఈ పథకం జనవరి 1, 2017న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.
==> ఈ స్కీమ్ మొదటి కాన్పుకు మాత్రమే వర్తిస్తుంది

Also Read: Adipurush Twitter Review: ఆదిపురుష్ ట్విట్టర్ రివ్యూ.. ఆడియన్స్ రియాక్షన్ ఇదే..

==> అన్ని రాష్ట్రాల్లో ఈ పథకం అందుబాటులోకి ఉంది.
==> ఎల్ఎంపీ తేదీ, ఎంసీపీ కార్డు కచ్చితంగా కావాలి.
==> మీ ఆశా వర్కర్ దగ్గర అడిగి తెప్పించుకోండి.
==> రెండో కాన్పుకు మాతృ వందన యోజన పథకం వర్తించదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న మహిళా ఉద్యోగులకు కూడా ఈ స్కీమ్ వర్తించదు.  

లబ్ధిదారులు మూడు విడతల్లో పథకం సొమ్మును అందుకుంటారు. మొదటి విడత కింద రూ.1000, రెండో విడత రూ.2 వేలు, మూడో విడత రూ.2 వేలు అందజేస్తుంది. ఈ డబ్బు నేరుగా గర్భిణుల బ్యాంకు అకౌంట్‌లోకి జమ చేస్తుంది. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://wcd.nic.in/schemes/pradhan-mantri-matru-vandana-yojana ని సంప్రదించవచ్చు. 

Also Read: TS Gurukul Recruitment 2023: అభ్యర్థులకు ముఖ్యగమనిక.. 9,231 ఉద్యోగ ఖాళీలకు పరీక్షలు ఎప్పుడంటే..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News