Income tax return:గడువులోగా ఐటీ రిటర్న్ ఫైల్ చేయకుంటే ఏం జరుగుతుంది?

IT Returns: 2021-22 వార్షిక సంవత్సరానికి గాను ఆదాయ పన్ను చెల్లింపునకు మరికొద్ది గంటలే సమయం ఉంది. జూలై 31 అర్ధరాత్రి వరకు ఐటీ రిటర్న్ దాఖలు చేయవచ్చు. ఈసారి గడువు పొడిగింపు ఉండదని ఆదాయపు పన్ను విభాగం అధికారులు చెబుతున్నారు. 

Written by - Srisailam | Last Updated : Jul 31, 2022, 12:58 PM IST
  • ఐటీ రిటర్న్ ఫైల్ నేడే లాస్ట్
  • ఐదు కోట్లు దాటిన రిటర్న్స్
  • గడువు దాటిపై జరిమానా కట్టాల్సిందే!
 Income tax return:గడువులోగా ఐటీ రిటర్న్ ఫైల్ చేయకుంటే ఏం జరుగుతుంది?

IT Returns: 2021-22 వార్షిక సంవత్సరానికి గాను ఆదాయ పన్ను చెల్లింపునకు మరికొద్ది గంటలే సమయం ఉంది. జూలై 31 అర్ధరాత్రి వరకు ఐటీ రిటర్న్ దాఖలు చేయవచ్చు. ఈసారి గడువు పొడిగింపు ఉండదని ఆదాయపు పన్ను విభాగం అధికారులు చెబుతున్నారు. గత మూడు రోజులుగా భారీగా ఇనకం ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశారని తెలుస్తోంది. చివరి మూడు రోజుల్లోనే దాదాపు కోటిన్నర ఐటీ రిటర్న్ర్స్  వచ్చాయంటున్నారు. సీబీడీటీ లెక్కల ప్రకారం జూలై 30వ తేదీ వరకు దాదాపు ఐదు కోట్ల రిటర్న్స్  దాఖలయ్యాయి. అయినా ఇంకా 40 శాతం మంది ఫైల్ చేయలేదని తెలుస్తోంది. 2020-21 సంవత్సరానికి గాను 5.7 కోట్ల ఐటీ రిటర్న్ వచ్చాయి. ఈసారి దాదాపు ఏడు కోట్ల వరకు వస్తాయని ఐటీ శాఖ అంచనా వేసినా.. ఆ పరిస్థితి కనిపించడం లేదు. 

గతంలో ఐటీ కార్యాలయాలకు వెళ్లి ఐటీ రిటర్న్స్ దాఖలు  చేసేవారు. ఇందుకోసం టెంట్లు వేసి మరీ ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసేవారు. ఇప్పుడు మాత్రం  ఆన్ లైన్ లో ఫైల్ చేసుస్తున్నారు.  అయినా అనుకున్నతంగా రిటర్న్స్  రావడం లేదు. ఐటీ రిటర్న్ ను దాఖలు మందకొడిగా ఉండటానికి పలు కారణాలు చెబుతున్నారు. ప్రతిసారి గడువును పెంచుకుంటూ పోతుంటారు. అందుకే గడవు పెంచాతారనే నమ్మకంతో కొందరు రిటర్న్స్ దాఖలు చేయడం లేదని తెలుస్తోంది. అయితే ఈసారి మాత్రం గడువు పెంపు ఉండదని ఆర్థిక శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంలో అశ్రద్ధ వహిస్తే తర్వాత బాధ పడాల్సి వస్తుందని.. ఎవరైనా మిగిలి ఉంటే వెంటనే  ఐటీ రిటర్న్ ఫైల్ చేయాలని సీబీడీటీ అధికారులు సూచిస్తున్నారు. 

అయితే గడువులోగా  ఐటీఆర్ దాఖలు చేయకుంటే ఏమవుతుందో కూడా చాలా మందికి అవగాహన లేదు. ఐటీఆర్ ను గడువులోపు చేయకుండే పలు రకాల జరిమానాలు విధిస్తారు. వార్షిక ఆదాయం రూ.5 లక్షల కంటే తక్కువగా ఉన్న వారు సకాలంలో ఫైల్ చేయకపోతే వాళ్లకు వెయ్యి రూపాయల వరకు ఫైన్ వేస్తారు. వార్షిక ఆదాయం ఐదు లక్షల రూపాయలకు పైగా ఉంటే మాత్రం ఐదు వేలు రూపాయలు జరిమానాగా కట్టాల్సి ఉంటుంది. ఫైన్ పడకుండా ఉండాలంటే సమయానికి ఐటీఆర్ దాఖలు చేయాల్సిందే. మీరు ఐటీ పరిధిలోకి వచ్చేవారు అయితే ఏమాత్రం లేట్  చేయకుండా వెంటనే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయండి.  

Also Read: Apple iPhone 13: యాపిల్ ఐఫోన్ 13పై బంపరాఫర్.. రూ.29 వేల వరకు తగ్గింపు..   

Als Read: Earthquake: ఖాట్మండులో భూకంపం.. బీహార్ లోనూ ప్రకంపనలు.. వణికిన జనాలు   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook

Trending News