Whatsapp Big Alert: ఈ ఫోన్లలో వాట్సప్ ఇకపై పనిచేయదు, మీ ఫోన్ ఉందో లేదో చెక్ చేసుకోండి

Whatsapp Big Alert: ప్రముఖ సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్ వాట్సప్ వినియోగదారులకు బిగ్ అప్‌డేట్ ఇది. మీరు ఇంకా ఆ ఫోన్‌లు వినియోగిస్తుంటే మీ వాట్సప్ ఎక్కౌంట్ పనిచేయదు. అదేంటని ఆశ్చర్యపోతున్నారా...నిజమే వెంటనే చెక్ చేసుకోకుండా మీ వాట్సప్ పనిచేయదు మరి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 3, 2024, 01:03 PM IST
Whatsapp Big Alert: ఈ ఫోన్లలో వాట్సప్ ఇకపై పనిచేయదు, మీ ఫోన్ ఉందో లేదో చెక్ చేసుకోండి

Whatsapp Big Alert: స్మార్ట్‌ఫోన్‌లు వినియోగించే ప్రతి ఒక్కరూ వాట్సప్ వాడుతున్నారు. వాట్సప్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికీ ఓ నిత్యావసరంగా మారింది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో వాట్సప్ యూజర్లను మరింతగా ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో వాట్సప్ నుంచి వెలువడిన కీలకమైన అప్‌డేట్ యూజర్లను ఆందోళనకు గురి చేస్తోంది. 

ప్రముఖ సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్ వాట్సప్ ఇకపై ఆ ఫోన్లలో పనిచేయదు. కొన్ని డివైస్‌ల నుంచి వాట్సప్ సేవలు నిలిపివేయబడ్డాయి. ఇది వాట్సప్ నుంచి వెలువడిన బిగ్ అప్‌డేట్. మీరింకా అవే పాత ఫోన్‌లు ఉపయోగిస్తుంటే ఈ అప్‌డేట్ మీక్కూడా వర్తిస్తుంది. ముఖ్యంగా ఆండ్రాయిడ్ లేదా ఐవోఎస్ పాత వెర్షన్ కలిగి ఉన్న ఫోన్లలో వాట్సప్ సేవలు పనిచేయవని వాట్సప్ స్వయంగా వెల్లడించింది. అలాంటి ఫోన్ల నుంచి వాట్సప్ సేవలు నిలిపివేయబడుతున్నాయి. పాత ఆపరేటింగ్ సిస్టమ్ కలిగిన స్మార్ట్‌ఫోన్లపై ఇకపై వాట్సప్ పనిచేయదు. అందుకే ఎప్పటికప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్ చేసుకోవాలి. ముఖ్యంగా ఆండ్రాయిడ్ 4 లేదా అంతకంటే పాత ఓఎస్, ఐవోఎస్ 11 లేదా అంతకంటే పాత వెర్షన్ కలిగి ఉంటే వెంటనే అప్‌డేట్ చేసుకోవల్సి ఉంటుంది. లేకపోతే వాట్సప్ సేవలు పనిచేయవు. 

ప్రస్తుతం ఐవోఎస్‌లో అయితే 18 వెర్షన్, ఆండ్రాయిడ్‌‌లో 15 వెర్షన్ నడుస్తోంది. ఇప్పటికీ చాలామంది పాత వెర్షన్ ఓఎస్ వాడుతున్నారు. ఇక అలాంటి డివైస్‌లో వాట్సప్ సేవలు నిలిచిపోయాయి. ఆండ్రాయిడ్ 4 లేదా ఐవోఎస్ 11 తో పనిచేసే ఫోన్లలో వాట్సప్ సేవలు ఉండవు. ఆండ్రాయిడ్ 5, ఐవోఎస్ 12 లేదా ఆ తరువాత వెర్షన్లు ఉన్న డివైస్‌లలోనే వాట్సప్ సేవలు కొనసాగనున్నాయి. అయితే దీనికోసం వచ్చే ఏడాది మే వరకూ గడువుంది. మే తరువాత వాట్సప్ సేవలు పనిచేయవు. 

మరీ ముఖ్యంగా మే 5 నుంచి ఐవోఎస్ 15.1 లేదా ఆ తరువాత వెర్షన్ ఉన్న ఫోన్లలోనే వాట్సప్ పనిచేస్తుంది. అంటే ఐఫోన్ 5ఎస్, ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ ఫోన్లలో వాట్సప్ ఇక పనిచేయదు. ఐఫోన్ యూజర్లు వాట్సప్ సేవలు పొందేందుకు ఐవోఎస్ 15.1 లేదా ఆ తరువాత వెర్షన్ అప్‌డేట్ చేసుకోవాలి. సెట్టింగ్స్ -జనరల్-సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ఆప్షన్ల ద్వారా మీ ఐఫోన్ ఏ వెర్షన్ అనేది చెక్ చేయవచ్చు. 

 

 

Trending News