Haryana Woman Kidnap Case: కారులో కూర్చున్న మహిళని కిడ్నాప్ చేయబోయారు.. సీసీటీవీ దృశ్యాలు వైరల్

Haryana Woman Kidnap Case: సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాల ప్రకారం డిసెంబర్ 31న ఈ ఘటన చోటుచేసుకున్నట్టు అర్థమవుతోంది. ఒక షాపింగ్ కాంప్లెక్ట్ ఎదుట రోడ్డు పక్కనే పార్క్ చేసి ఉన్న కారులో ఒక యువతి కార్చుని ఉంది. అప్పుడే జిమ్ కి వెళ్లి వచ్చిన ఆ యువతి కారులో కూర్చుని డ్రైవర్ కోసం వేచిచూస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 1, 2023, 07:18 PM IST
Haryana Woman Kidnap Case: కారులో కూర్చున్న మహిళని కిడ్నాప్ చేయబోయారు.. సీసీటీవీ దృశ్యాలు వైరల్

Haryana Woman Kidnap Case: పట్టపగలే తన కారులో కూర్చున్న యువతిని నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు కారుతో సహా కిడ్నాప్ చేసేందుకు విఫలయత్నం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. హర్యానాలోని యమునా నగర్ లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాల ప్రకారం డిసెంబర్ 31న ఈ ఘటన చోటుచేసుకున్నట్టు అర్థమవుతోంది. ఒక షాపింగ్ కాంప్లెక్ట్ ఎదుట రోడ్డు పక్కనే పార్క్ చేసి ఉన్న కారులో ఒక యువతి కార్చుని ఉంది. అప్పుడే జిమ్ కి వెళ్లి వచ్చిన ఆ యువతి కారులో కూర్చుని డ్రైవర్ కోసం వేచిచూస్తోంది. ఇంతలోనే కారులో యువతి ఒంటరిగా కూర్చుని ఉండటం గమనించిన నలుగురు దుండగులు.. ఏమీ తెలియనట్టే ఆ కారు నాలుగు వైపుల నుంచి చుట్టుముట్టారు. ఒకరికొకరు సంబంధం లేనట్టే నాలుగు వైపుల నుంచి వచ్చి ఒక్కసారిగా కారులోకి దౌర్జన్యంగా ప్రవేశించి యువతిని కిడ్నాప్ చేయబోయారు. 

అయితే ఊహించని పరిణామానికి ఖంగుతిన్న యువతి కిడ్నాపర్లను చూసి వెంటనే భయంతో బిగ్గరగా కేకలు వేసింది. యువతి గట్టిగా ప్రతిఘటించడంతో కిడ్నాపర్లకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా కాసేపు ఇక్కడే ఉంటే నలుగురు వచ్చి తమని పట్టుకుంటారనే భయంతో కిడ్నాపర్లు వెంటనే యువతిని విడిచిపెట్టి కారు దిగి పరారయ్యారు. ఈ దృశ్యాలన్ని అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ ఎదుట ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. 

ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం వీడియో వైరల్‌గా మారింది. యమునా నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే నలుగురు నిందితులలో ఒకరిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.

Trending News