Family Suicide: స్నానం చేయిస్తానని చెప్పి పిల్లలను చెరువులోకి తోసి ఆపై ఆమె దూకి..విషాదం

Mother Thrown His Kids After She Felldown Into Ibrahimpatnam Pond: టీచర్స్‌ డే రోజే ఓ విద్యార్థిని సొంత తల్లే చెరువులో ముంచేసి ఆపై ఆమె ఆత్మహత్యలకు పాల్పడడంతో ఉపాధ్యాయ దినోత్సవం విషాదంగా మారింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Sep 6, 2024, 01:16 AM IST
Family Suicide: స్నానం చేయిస్తానని చెప్పి పిల్లలను చెరువులోకి తోసి ఆపై ఆమె దూకి..విషాదం

Ibrahimpatnam Lake: ఏ కష్టమొచ్చిందో తెలియదు కానీ ఉపాధ్యాయుల దినోత్సవం రోజే ఓ కన్నతల్లి తన పిల్లలను చంపేసి ఆపై ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. స్నానం చేసేందుకు అని తన పిల్లలను చెరువు దగ్గరకు తీసుకొచ్చింది. అనంతరం అదే చెరువులోకి పిల్లలను తోసేసి ఆపై ఆమె దూకేసిన విషాద సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. క్షణికావేశంలో ముగ్గురి ప్రాణాలు జల సమాధి అయ్యాయి. ఈ ఘటన హైదరాబాద్‌ శివారులోని ఇబ్రహీంపట్నంలో జరిగింది. పోలీసులు, మృతుల కుటుంబసభ్యుల సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: No Hidden Camera: ఇది నిజం.. గుడ్లవల్లేరు గర్ల్స్‌ హాస్టల్‌లో రహాస్య కెమెరాలు లేవు: పోలీస్‌ శాఖ

 

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నివసిస్తున్న మంగమ్మకు ఇద్దరు కొడుకులు, ఒక పాప. గురువారం సాయంత్రం 7.30 ప్రాంతంలో తన ముగ్గురు పిల్లలతో కలసి ఇబ్రహీంపట్నం చెరువు వద్దకు వచ్చింది. పిల్లలను చెరువు వద్ద స్నానం చేద్దామని నచ్చజెప్పి చెరువు వద్దకు పిల్లలను తీసుకువచ్చింది. కొద్దిసేపటికి పాప, పెద్ద కొడుకును ఉన్నట్టుండి చెరువులోకి తోసేసింది. ఆ తర్వాత మంగమ్మ కూడా అదే చెరువులోకి దూకింది. ఇది చూసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం.

Also Read: Actress Sowmya: వాడు దర్శకుడు కాదు.. చిత్తకార్తె కుక్కలాగా ప్రవర్తించాడు: హీరోయిన్‌ సౌమ్య

 

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చెరువులో తల్లి మంగ, కుమారుడి మృతదేహాలు లభించాయి. మరో పాప మృతదేహం కోసం గాలింపు. కాగా బాధితులు రాలి కుటుంబం వివరాలు ఆరా తీయగా.. ఆ కుటుంబం వనస్థలిపురంలోకి చెందిన వారిగా గుర్తించారు. ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి ఇబ్రహీంపట్నం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతురాలికి సంబంధించిన మరిన్ని వివరాలు రావాల్సి ఉంది. ఆమె ఎందుకు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడరనేది తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుఉకుని దర్యాప్తు చేస్తున్నారు. త్వరలో మిగతా విషయాలు వెల్లడిస్తామని ఎస్సై స్థానికులను వెళ్లగొట్టారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x