Prestige Murder: ఏపీలో పరువు హత్య.. ఆ కులం కుర్రాడిని ప్రేమించిందని చంపి ఉరేశారు.. కానీ?

Prestige Murder in Chandragiri : ఏపీలో మరో పరువు హత్య సంచలనంగా మారింది, తిరుపతి జిల్లా చంద్రగిరిలో మోహనకృష్ణ అనే యువతిని కుటుంబ సభ్యులే చంపినట్టు తేలింది. ఆ వివరాల్లోకి వెళితే   

Written by - Chaganti Bhargav | Last Updated : Dec 3, 2022, 10:36 AM IST
Prestige Murder: ఏపీలో పరువు హత్య.. ఆ కులం కుర్రాడిని ప్రేమించిందని చంపి ఉరేశారు.. కానీ?

Prestige Murder in Chandragiri Andhra Pradesh: టెక్నాలజీ పరంగా మనిషి ఎంత ముందుకు వెళుతున్నా కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం ఇంకా మూఢనమ్మకాలు విడనాడడం లేదు, మరీ ముఖ్యంగా కులం, మతం లాంటి పట్టింపుల విషయంలో మాత్రం చాలా సీరియస్ గా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే తమకు ఇష్టం లేని వ్యక్తులను ప్రేమించినా, ఇతర కులాల వ్యక్తులను ప్రేమించిన తమ కడుపున పుట్టిన పిల్లలను కూడా చంపుకునేందుకు కూడా ఏమాత్రం వెనుకాడడం లేదు.

తాజాగా తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రెడ్డివారి పల్లి పంచాయతీలో జూలైలో జరిగిన ఒక ఆత్మహత్య కేసు ఇప్పుడు హత్య కేసుగా తేలింది. ఐదు నెలల తర్వాత పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులు అది  ఆత్మహత్య కాదని హత్య అని తేల్చారు. పోలీసులు చెబుతున్న కథనం మేరకు చంద్రగిరికి చెందిన మునిరాజా అనే వ్యక్తి కుమార్తె 19 ఏళ్ల మోహనకృష్ణ రెడ్డి వారి పల్లి పంచాయతీ ఎస్ఎల్ నగర్ లోని తన మేనమామ బాలకృష్ణ ఇంట్లో ఉండి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా ఇంటర్ చదువుతోంది.

రామిరెడ్డి పల్లి పంచాయతీ ఆంజనేయ పురానికి చెందిన వికాస్ అనే యువకుడితో ఆమె గత ఐదేళ్లుగా ప్రేమలో ఉంది. అయితే వీరిద్దరి కులాలు ఒకటి కాకపోవడంతో యువతి ఇంట్లోని వారు వారి పెళ్లికి అంగీకరించలేదు, నిజానికి వీరిద్దరు పెళ్లి గురించి రెండు కుటుంబాల మధ్య చర్చలు జరిగిన కులాలు వేరు కాకపోవడంతో అమ్మాయి తరఫున వారు పెళ్ళికి అంగీకరించలేదు. దీంతో ఈ ఏడాది జూలై 1వ తేదీన మోహనకృష్ణ, వికాస్ ఇద్దరూ ఇంట్లో ఎవరికీ చెప్పకుండా పారిపోయారు.

దీంతో యువతి కుటుంబ సభ్యులు అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రేమ జంటను ట్రేస్ చేసి తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అయితే ప్రియుడి నుంచి తనను దూరం చేశారనే మనస్థాపనతో ఆమె జూలై 7వ తేదీన ఇంట్లో ఫ్యాన్ కి ఉరేసుకుని చచ్చిపోయినట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అప్పట్లో గ్రామస్తులు అది ఆత్మహత్య కాదని కుటుంబ సభ్యులు హత్య చేసి ఉంటారని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆమె బాడీని పోస్టుమార్టంకి పంపించారు.

అయితే సుమారు ఐదు నెలల తర్వాత ఆమె పోస్టుమార్టం నివేదిక అందింది. అయితే ఈ పోస్టుమార్టం నివేదికలో యువతి ఉరేసుకుని చనిపోలేదని బలవంతంగా ఆమె గొంతు నిలిపి చంపేశారని తేలింది. ఈ నేపథ్యంలో పోలీసు అధికారులు యువతి మేనమామ ఇంటికి వెళితే, అప్పటికే తాళాలు వేసి వాళ్ళు పరారయ్యారు. 

Also Read: HIT 2 Main Villain : HIT 2 విలన్.. నెట్టింట్లో దారుణమైన ట్రోల్స్.. పరువుతీస్తోన్న నెటిజన్లు

Also Read: Rajamouli Oscar Award : రాజమౌళికి ఆస్కార్ అవార్డ్ ఫిక్స్.. ఇదిగో సాక్ష్యం.. నెట్టింట్లో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 
 

Trending News