Aadi Sai Kumar : వెకేషన్‌లో ఆది?.. భార్యతో ఫుల్ చిల్.. ప్రమోషన్స్‌లో 'టాప్ గేర్‌'

Aadi Sai Kumar Enjoys At Vacation ఆది సాయి కుమార్ ప్రస్తుతం వెకేషన్‌లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక మరో వైపు ఆది సాయి కుమార్ నటించిన టాప్ గేర్ సినిమా విడుదలకు సిద్దమవుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 14, 2022, 03:09 PM IST
  • వెకేషన్లో ఆది సాయి కుమార్
  • జెట్ స్పీడులో టాప్ గేర్ ప్రమోషన్స్‌
  • డిసెంబర్ 30న రాబోతోన్న ఆది చిత్రం
Aadi Sai Kumar : వెకేషన్‌లో ఆది?.. భార్యతో ఫుల్ చిల్.. ప్రమోషన్స్‌లో 'టాప్ గేర్‌'

Aadi Sai Kumar Top Gear Release Date ఆది సాయి కుమార్ ప్రస్తుతం వెకేషన్‌లో ఉన్నట్టుగా కనిపిస్తోంది. పెళ్లై ఎనిమిదేళ్లు అవుతోన్న సందర్భంగా అలా ఫారిన్ ట్రిప్ వేసినట్టు కనిపిస్తోంది. ఆది అలా చిల్ అవుతుంటే.. ఆయన సినిమా మాత్రం ఇక్కడ విడుదలకు రెడీ అవుతోంది. సినిమా టైటిల్‌కు తగ్గట్టే ప్రమోషన్స్‌ టాప్ గేర్‌లో ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి ప్రతీ అప్డేట్ అందరినీ ఆకట్టుకుంది. చివరగా మారుతి చేతుల మీదుగా రిలీజ్ చేయించిన టీజర్ అందరినీ మెప్పించింది.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ActorAadi (@aadipudipeddi)

ఈ ఏడాది ఆది సాయి కుమార్ వరుస చిత్రాలతో మెప్పించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇప్పటీకే తీస్ మార్ ఖాన్, క్రేజీ ఫెల్లో అంటూ వచ్చాడు. ఇక ఇప్పుడు ఈ ఏడాది చివర్లో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. టాప్ గేర్ సినిమాను డిసెంబర్ 30న విడుదల చేయబోతోన్నట్టుగా మేకర్లు ప్రకటించారు.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ActorAadi (@aadipudipeddi)

డిసెంబర్ 30న రాబోతోన్న టాప్ గేర్ సినిమాను కె.శశికాంత్ తెరకెక్కిస్తుండగా.. శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్  బ్యానర్ పై ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో  కేవీ శ్రీధర్ రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మించాడు. ఈ చిత్రంలో ఆదికి జోడి రియా సుమన్ నటించింది. ఇక ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశకు వచ్చేశాయి. ఈ మూవీ నుంచి టీజర్ ఇది వరకే రాగా.. ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్రయూనిట్ రెడీ అయింది. డిసెంబర్ 18న ఈ మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేయబోతోన్నారు.

Also Read : waltair Veerayya Boss Party : పరుగులో ఆగిన బాలయ్య.. దూసుకుపోతోన్న చిరంజీవి

Also Read : RGV Siri Stazie : రాళ్లతో కొట్టి చంపేసేవారు, వెలేసేవారు.. అలా బతికిపోయారు.. ఆర్జీవీపై బీవీఎస్ రవి కామెంట్స్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News