Kuppam Politics: కుప్పం గంగమ్మ తల్లి జాతరలో వైసిపిలో రెండు వర్గాలకు చెందిన నాయకుల మధ్య జరిగిన భారీ ఘర్షణ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘర్షణలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇరువర్గాల మధ్య జరిగిన దాడికి సంబంధించిన దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేవిగా ఉన్నాయి.
Eggs Pelted at Nara Lokesh: పోలీసులపై నారా లోకేష్ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా లోకేష్‌పై కోడి గుడ్లతో దాడికి పాల్పడిన వ్యక్తిపై టిడిపి కార్యకర్తలు దాడి చేస్తుండగా.. వారి నుండి పోలీసులు ఆ వ్యక్తిని రక్షించి అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
Who is YS Anil Reddy: వైఎస్ కుటుంబం నుంచి మరో యువనేత రాజకీయారంగేట్రం చేయబోతున్నారా ? ఇప్పటివరకు వైసీపీ ప్రభుత్వంలో షాడోగా వ్యవహరిస్తున్న వ్యక్తి ఇక తెరపైకి రావాలని నిర్ణయించుకున్నారా? వైఎస్ జగన్ ఆర్థికపరమైన, రాజకీయ పరమైన వ్యవహారాలను తెరవెనుక ఉంటూ చక్కబెడుతున్న ఆ యువనేత ఇక నేరుగా రాజకీయాల్లోకి రాబోతున్నారా ?
Anil Kumar Yadav About AP CM YS Jagan: పేరున్న గొర్రె కన్నా ఒంటరి సింహంగా ఉండటం మేలు అని వ్యాఖ్యానించిన అనిల్... ఒక సంవత్సరం పాటు తన గురించి కొందరు రకరకాలుగా మాట్లాడారు. సమయం వచ్చినప్పుడు అవన్నీ సీఎం జగనన్నకు చెబుతా అని గుర్తుచేశారు. తనకు ఏదైనా బాధ కలిగితే కచ్చితంగా తనను బాధించిన విషయం గురించి సీఎం జగన్ కి చెప్పుకుంటా అని పేర్కొన్నారు.
కాపు ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్యే ముద్రగడ పద్మనాభం రాజకీయ ఊహాగానానలకు తెరదించనున్నారు. ఏ పార్టీలో చేరేది, ఎక్కడి నుంచి పోటీ చేసేది దాదాపుగా నిర్ణయించుకున్నారు. అదే జరిగితే రాజకీయంగా హాట్ టాపిక్ కానుంది.
MLA Chennakesava Reddy on Jr NTR: తెలుగుదేశం పార్టీకి ఎప్పటికైనా నాయకుడు జూనియర్ ఎన్టీఆరేనని వైసీపీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి అన్నారు. నారా లోకేష మరో పది యాత్రలు చేసినా నాయకుడు కాలేడని సెటైర్లు వేశారు. ఎన్టీఆర్‌ను తీసుకురావాలని టీడీపీ నేతలే కోరుతున్నారని అన్నారు.
Jagananna Vasathi Devena Money: అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నార్పలలో సీఎం వైయస్ జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి జగనన్న వసతి దీవెన ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 9,55,662 మంది విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో రూ.912.71 కోట్లను జమ చేశారు.
AP Politicians Twitter Followers: ట్విట్టర్‌లో ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మరో మైలురాయిని దాటారు. ఆయన ఫాలోవర్లు 5 మిలియన్లు దాటారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల్లో పవన్ కళ్యాణ్‌కు ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. సీఎం జగన్‌కు ఎంత మంది ఉన్నారంటే..?
Complaint Filed on Dog For Toring Jagan Sticker: కుక్క ఒక ఇంటి ముందున్న ‘మా నమ్మకం నువ్వే జగన్’ స్టిక్కర్ను తొలగిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవగా ఆ కుక్క మీద ఒక పోలీస్ స్టేషన్లో మహిళలు ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది.
Minister Roja Warns Nara Lokesh: పిల్లగాడు లోకేష్ పెద్దా, చిన్నా లేకుండా మాట్లాడుతున్నాడు. మా ఎమ్మెల్యేలను ఉరికించి కొడతా అని లోకేష్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని వార్నింగ్ ఇస్తున్నాను అని చెబుతూ నేరుగానే నారా లోకేష్‌ని హెచ్చరించారు.
CM Jagan Mohan Reddy: ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వైఎస్సార్సీపీ కళ్లు తెరిపిస్తున్నాయా..? 175 సీట్లు టార్గెట్‌గా పెట్టుకున్న సీఎం జగన్.. పార్టీలో ఎలాంటి మార్పులు చేయబోతున్నారు..? పార్టీలో నెంబర్ 2గా అన్ని తానై వ్యవహరిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి ప్రాధాన్యం తగ్గించనున్నారా..? వైసీపీ వర్గాలు ఏం చెబుతున్నాయి..?
AP MLA Quota MLC Elections: ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ ప్రభుత్వం జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తోంది. 7 ఎమ్మెల్సీ స్థానాలకు 8 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా.. ఒకే ఒక్క ఎమ్మెల్యే ఓటు చుట్టూనే ఈ ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల రాజకీయం తిరుగుతోంది.
Kanna Lakshminarayana: అనుకున్నదే జరిగింది. పార్టీ వీడుతారనే ప్రచారం నిజమైంది. బీజేపీకు ఆ పార్టీ ఏపీ మాజీ అధ్యక్షుడు రాజీనామా చేసేశారు. ఇక నెక్స్ట్ ఏంటి, కన్నా లక్ష్మీ నారాయణ పయనం ఎటువైపనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Andhra Pradesh Politics: పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో జనసేనకు పెరుగుతోన్న ఆదరణ తెలుగుదేశం పార్టీ మనుగడకు ఎసరు పెడుతోందా..? క్షేత్రస్థాయిలో టీడీపీ ఓటు బ్యాంకు.. జనసేన పార్టీకి డైవర్ట్ అవుతోందా..? టీడీపీ జనసేన పొత్తులో భాగంగా తణుకు సీటును జనసేనకు కేటాయించే అవకాశం కనిపిస్తోందా..? టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ పరిస్థితి ఏంటి..?
వైఎస్సార్సీపీ ముఖ్య నేతలతో సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు సమావేశం నిర్వహించనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు, వచ్చే ఎన్నికలపై పార్టీ నాయకులు దిశానిర్దేశం చేయనున్నారు. అదేవిధంగా ప్రభుత్వ పథకాల అమలు తీరుపై కూడా రిపోర్ట్ ఇవ్వనున్నారు.
Tuni Politics: ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఎన్నికల సమీపించేకొద్దీ అధికార, ప్రతిపక్షాల్లో అసమ్మతి గళం పెరుగుతోంది. నిన్నటి వరకూ నెల్లూరు రాజకీయం అధికార పార్టీని ఇరుకునపెడితే..ఇప్పుడు తుని రాజకీయాలు ప్రతిపక్షాన్ని సమస్యల్లో పడేస్తున్నాయి.