TNR Passed Away | కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా భారీగా ప్రాణనష్టాన్ని కలిగిస్తోంది. కరోనా ఫస్ట్ వేవ్‌తో పోల్చితే కరోనా సెకండ్ వేవ్‌లో పలువురు సెలబ్రిటీలను కరోనా మహమ్మారి పొట్టన పెట్టుకుంది. పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు కరోనా బారిన పడి కోలుకున్నారు. ఈ క్రమంలో తాజాగా యూట్యూబ్ హోస్ట్, నటుడు, ప్రముఖ జర్నలిస్ట్ టీఎన్ఆర్(T Narasimha Rao) సైతం కన్నుమూశారు.
సినీ జర్నలిస్ట్ TNR ఇటీవల కరోనా బారిన పడ్డారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి గత కొన్నిరోజులుగా చికిత్స పొందుతున్నారు. వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో నటుడు టీఎన్ఆర్ తుదిశ్వాస విడిచారు. టీఎన్ఆర్ మరణవార్తతో టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి లోనైంది. టీఎన్ఆర్ మరణంపై తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సంతాపం ప్రకటిస్తున్నారు. TNR కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.
Also Read: Prasada Rao Passes Away: ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ ప్రసాదరావు కన్నుమూత
ప్రముఖ జర్నలిస్ట్ TNR కరోన తో కన్నుమూత
Popular Youtube Host, Actor TNR Passed Away Due To COVID
May His Soul Rest In Peace pic.twitter.com/u0BYEWbxLW
— BARaju (@baraju_SuperHit) May 10, 2021
‘ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ టీఎన్ఆర్’ (Frankly Speaking With TNR) కార్యక్రమంతో ఎంతో మంది సినీ ప్రముఖులను TNR ఇంటర్వ్యూ చేశారు. పలు విషయాలు రీసెర్చ్ చేసి ఇంటర్వ్యూలు చేసే జర్నలిస్ట్ కన్నుమూయడంపై టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఎన్నో విషయాలు తెలుసుకుని ప్రముఖులను ఇంటర్వ్వూ చేసి, వారి మనసులో మాటను రాబట్టే వ్యక్తి టీఎన్ఆర్ అని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Also Read: COVID-19 Cases: భారత్‌లో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు, కోవిడ్19 మరణాలు
Shocked to hear that TNR gaaru passed away .. have seen few of his interviews and he was the best when it came to his research and ability to get his guests to speak their heart out . Condolences and strength to the family 🙏🏼
— Nani (@NameisNani) May 10, 2021
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ అనిల్ రావిపూడి టీఎన్ఆర్ మరణంపై స్పందించారు. TNR మరణ వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. జెంటిల్మెన్‌ను కోల్పోయాం. మిస్ యూ సర్, మీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి అని ట్వీట్ చేశారు. టీఎన్ఆర్‌పై కరోనా దయ చూపించలేదంటూ డైరెక్టర్ మారుతి ట్వీట్ చేశారు. టీఎన్ఆర్ ఇకలేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానంటూ పోస్ట్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook