Actor siddharth: ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ ధరలపై తగ్గింపు వివాదం రోజు రోజుకు ముదురుతోంది. సినిమా ఇండస్ట్రీ వర్సెస్ రాజకీయాల నాయకులు అనే స్థాయికి చేరుతున్నట్లు తెలుస్తోంది.
తాజాగా సినిమా టికెట్ ధరల తగ్గింపు వివాదంపై నటుడు సిద్ధార్థ్ స్పందించారు. సినిమా టికెట్ ధరల తగ్గింపును సమర్ధిస్తూ స్పందించిన మంత్రులపై ఆగ్రహం వ్యక్తం (Actor siddharth on Cinema Ticket Prices) చేశారు. ఎవరి పేరును ఉద్దేశించకుండా.. మంత్రులందరిని విమర్శించారు సిద్ధార్థ్. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు.
అయితే ప్రస్తుతం ఏపీలో మాత్రమే ఈ వివాదం నడుస్తున్న నేపథ్యంలో.. సిద్ధార్థ్ ఏపీ మంత్రులను ఉద్దేశించే ఈ విమర్శలు (Actor siddharth on AP ministers) చేసినట్లు తెలుస్తోంది.
ట్వీట్లో ఏముందంటే..
'టికెట్ ధరల తగ్గించి కస్టమర్లకు (ప్రేక్షకులకు) డిస్కౌంట్ ఇస్తున్నామని మాత్రులు మాట్లాడుతున్నారు. మేము పన్ను చెల్లింపుదారులం. మీరు అనుభవిస్తున్న లగ్జరీలన్నింటికీ మేము చెల్లింపులు చేస్తున్నాం. రాజకీయనాయకులు మాత్రం అక్రమంగా లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. కాబట్టి మీరు కూడా లగ్జరీలు తగ్గించుకుని.. మాకూ డిస్కౌంట్ ఇవ్వండి' అని సిద్ధార్థ్ విమర్శనాత్మకంగా (Actor siddharth tweet on Cinema Ticket prices) స్పందించారు.
Ministers who speak of reducing cost of cinema and passing on the discount to customers..
We are tax payers. We are paying for all your luxuries...+ the lacs of crores politicians have earned through corruption...
Reduce your luxuries. Give us our discount. 🙏🏽🙏🏽🙏🏽#whatLOGIC
— Siddharth (@Actor_Siddharth) December 23, 2021
మరో ట్వీట్లో.. క్రికెట్ స్టేడియాల పరిమాణం తగ్గించడం, క్రికెటర్ల వేతనాలు తగ్గించడం ద్వారా డిస్కౌంట్‌ను కస్టమర్లకు ఎందుకు బదిలీ చేయడం లేదన్నారు. వినోదం ఏదైనా వినోదమేనన్నారు. అలాటప్పుడు తమ ఇండస్ట్రీపైనే ఎందుకు ద్వేషిస్తున్నారని ప్రశ్నించారు.
How bout reducing the size and amenities of stadiums and reducing the cost of staging cricket matches... Pass on the discount to the customer... question cricketer salaries. They have talent. Actors have what?
Entertainment is entertainment.
Why this hatred for our industry?
— Siddharth (@Actor_Siddharth) December 24, 2021
వివాదానికి అసలు కారణం ఇలా..
నటుడు నాని తన తాజా సినిమా 'శ్యామ్ సింగరాయ్' ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల.. ఏపీలో సినిమా టికెట్ల ధరలు తగ్గించడంపై మాట్లాడారు. సినిమా టికెట్ల ధరలు తగ్గింపు నిర్ణయం (Actor Nani on Cinema Ticket prices in AP).. ప్రేక్షకులను అవమానించేలా ఉందన్నారు. ఈ వాఖ్యాలపై ఏపీ మంత్రులు వరుసగా నానిపై విమర్శలు చేస్తూ (AP Ministers on Actor Nani) స్పందించారు. దీనితో ఈ వివాదం రోజు రోజుకు ముదురుతున్నట్లు తెలుస్తోంది.
Also read: Trolls on Hero Nani: హీరో నానిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్.. సినిమా టికెట్లపై స్పందించడమే కారణమా?
Also read: Bigg Boss Telugu 6: ఓటీటీ వేదికగా తెలుగు బిగ్ బాస్... మళ్లీ నాగార్జునే హోస్ట్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook