Memories: ‘మెమరీస్’తో వచ్చేసిన శేఖర్ కమ్ముల హీరో .. అలరిస్తున్న మ్యూజిక్ వీడియో టీజర్

Sudhakar: శేఖర్ కమ్ముల కూడా దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో మనందరికీ పరిచయమైన హీరో సుధాకర్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో అందరి క్యారెక్టర్స్ కన్నా కూడా సుధాకర్ చేసిన నాగరాజు క్యారెక్టర్ అప్పట్లో ఎక్కువమందిని ఆకట్టుకుంది. ఆ తర్వాత కొన్ని సినిమాలలో కనిపించిన సుధాకర్ ఇప్పుడు మెమరీస్ అనే మ్యూజిక్ వీడియోతో మనం ముందుకు రాబోతున్నాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 18, 2023, 09:44 AM IST
Memories: ‘మెమరీస్’తో వచ్చేసిన శేఖర్ కమ్ముల హీరో .. అలరిస్తున్న మ్యూజిక్ వీడియో టీజర్

Sudhakar: లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో నాగరాజు పాత్ర చేసిన సుధాకర్ కొమాకుల 'మెమొరీస్' అనే మ్యూజిక్ వీడియోతో రాబోతున్నాడు.అతి త్వరలో 'మెమొరీస్' వీడియో సాంగ్ ని తెలుగు,మలయాళం, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో  నివ్రితి యూట్యూబ్ వేదికపై రిలీజ్ చేయనున్నారు. ఈ సాంగ్ ని సుధాకర్ తన సొంత బ్యానర్ సుఖ మీడియాలో నిర్మిస్తున్నాడు. శాన్ ఫ్యాన్సిస్కో నగరంలో ఈ సాంగ్ ని రియల్ వరల్డ్ ఫుటేజ్, 2డి యానిమేషన్ తో కలిపి చిత్రీకరించారు. ఈ నేపథ్యంలో ఈ పాట టీజర్ ను విడుదల చేశారు.

వర్ధమాన ఫిలిం మేకర్ అన్వేష్ భాష్యం దర్శకత్వంలో హీరో సుధాకర్ ఈ సాంగ్ ని తలకెక్కి. గతంలో అన్వేష్ సైమా అవార్డ్స్ లో నామినేట్ అయిన 'చోటు' అనే షార్ట్ ఫిలింకి కాన్సెప్ట్ రైటర్ గా.. సోని మ్యూజిక్ లో విడుదలైన మరో షార్ట్ ఫిలిం 'మనోహరం'కి రైటర్ గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేశారు. ఇప్పుడు మెమొరీస్ సాంగ్ వరుణ్ అనే యువకుడి కథని తెలియజేసే విధంగా ఉంటుంది. ఇక ఈ సాంగ్ కాన్సెప్ట్ విషయానికి వస్తే.‌ ఈ పాటలో వరుణ్ అనే యువకుడు తన జర్నీలో ఫీలింగ్స్ కోల్పోయే స్థితి నుంచి తన గమ్యం ఏంటి అని తెలుసుకునే వాడిగా ఎలా మారాడు అనేది ఉంటుంది.

తెలుగులో ఈ పాటకి రాహుల్ సిప్లిగంజ్ గాత్రం అందించగా.. కన్నడలో వాసుకి వైభవ్ పాడారు. ఈ పాటని వరుణ్ కంపోజ్ చేశారు. ఈ వీడియో సాంగ్ దృశ్యం పరంగా ఆకట్టుకుంటూ సింపుల్ హుక్ స్టెప్ కూడా కలిగి ఉంటుంది. ప్రతి ఒక్కరూ డ్యాన్స్ చేయాలనిపించే విధంగా ఆ స్టెప్ ఉంటుంది. 

అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ సాంగ్ జీవితంలో చోటు చేసుకునే మార్పులని హైలైట్ చేసే విధంగా ఉంటుంది అని ఈ ఆల్బమ్ మేకర్స్ తెలియజేశారు. కాగా ప్రస్తుతం ఈ సాంగ్ టీజర్ కి మాత్రం మంచి స్పందన వస్తోంది.

Also Read: Sumanth: విశాఖ శారదాపీఠాన్ని సందర్శించిన హీరో సుమంత్.. కొత్త సినిమా నామకరణం

Also Read: Infinix Zero Ultra Price: 200MP కెమెరా Infinix Zero Ultra మొబైల్ కేవలం రూ. 8,599కే పొందండి..మళ్లీ మళ్లీ రాని డీల్!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News