Adipurush shooting: ఆదిపురుష్ షూటింగ్‌లో Fire accident

Fire accident at Adipurush shooting sets: ఆదిలోనే హంసపాదు అన్నట్టు ఆదిపురుష్ మూవీ షూటింగ్‌లో తొలిరోజే పెద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. Prabhas ప్రధాన పాత్రలో నటిస్తున్న ఆదిపురుష్ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మంగళవారం ముంబైలో ప్రారంభం కాగా... సాయంత్రం షూటింగ్ సమయంలో మంటలు చెలరేగాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 2, 2021, 10:34 PM IST
Adipurush shooting: ఆదిపురుష్ షూటింగ్‌లో Fire accident

Fire accident at Adipurush shooting sets: ఆదిలోనే హంసపాదు అన్నట్టు ఆదిపురుష్ మూవీ షూటింగ్‌లో తొలిరోజే పెద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. Prabhas ప్రధాన పాత్రలో నటిస్తున్న ఆదిపురుష్ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మంగళవారం ముంబైలో ప్రారంభం కాగా... సాయంత్రం షూటింగ్ సమయంలో మంటలు చెలరేగాయి. ముంబై ఫైర్ బ్రిగేడ్ వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఆదిపురుష్ మూవీ సెట్స్ దెబ్బతిన్నాయి. ఆదిపురుష్ షూటింగ్ ఏర్పాట్లలో భాగంగా సిద్ధం చేసిన గ్రీన్ స్క్రీన్ క్రోమా సెట్‌ పూర్తిగా కాలిపోవడంతో పాటు భారీగానే ఆస్తి నష్టం కూడా వాటిల్లినట్టు తెలుస్తోంది. అదృష్టవశాత్తుగా ఈ అగ్ని ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. 

ఆదిపురుష్ షూటింగ్ సెట్స్‌లో ఆ సమయంలో ప్రభాస్ అక్కడ లేడు. రామగుండంలో జరుగుతున్న Salaar shooting లో పాల్గొంటున్న కారణంగా  ప్రభాస్ ఆదిపురుష్ షూటింగ్‌కి హాజరుకాలేకపోయినట్టు సమాచారం.

Also read : Prabhas శ్రీరాముడిగా వస్తున్న Adipurush shooting ప్రారంభం

బాలీవుడ్ డైరెక్టర్ Om Raut డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో Prabhas శ్రీరాముడిగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. సైఫ్ అలీ ఖాన్ ( Saif Ali Khan ) కూడా ఈ రోజు జరిగిన షూటింగ్‌లో పాల్గొనలేదు. 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్, రెట్రోఫైల్స్ నిర్మాణ సంస్థ అధినేత ప్రసాద్ సుతార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News