Happy Birthday Naga Chaitanya: నాగ చైతన్య బర్త్ డే.. సమంత పోస్టులు వైరల్.. అంత ప్రేమ ఎక్కడికిపోయింది?

Happy Birthday Naga Chaitanya: సమంత నాగ చైతన్య బంధానికి బీటలువారిన సంగతి తెలిసిందే. గత ఏడాది ఈ ఇద్దరూ విడిపోయారు. అప్పటి నుంచి నాగ చైతన్య అంటే సమంత దూరంగానే ఉంటోంది. కనీసం విషెస్ కూడా చెప్పడం లేదు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 23, 2022, 11:31 AM IST
  • నాగ చైతన్య బర్త్ డే
  • సమంత గత పోస్టులు వైరల్
  • ఇప్పుడైనా సమంత స్పందిస్తుందా?
Happy Birthday Naga Chaitanya: నాగ చైతన్య బర్త్ డే.. సమంత పోస్టులు వైరల్.. అంత ప్రేమ ఎక్కడికిపోయింది?

Happy Birthday Naga Chaitanya: సమంత నాగ చైతన్యల ప్రేమ, పెళ్లి, విడాకులు, వివాదాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏమాయ చేశావే సినిమాతో మొదలైన ప్రయాణం.. గత ఏడాది ముగిసింది. ప్రేమ పెళ్లి చివరకు పెటాకులైంది. విడాకులు తీసుకుని ఎవరి బతుకు వారు బతికేస్తున్నారు. సమంత అయితే కనీసం నాగ చైతన్యకు విషెస్ కూడా చెప్పడం మానేసింది. బాలీవుడ్, టాలీవుడ్ ఇలా హీరో, హీరోయిన్లందరికీ విషెస్ చెప్పే సమంత మాత్రం చైతూని పక్కన పెట్టేస్తోంది. వీరిద్దరి మధ్య బంధం బలంగా ఉన్న సమయంలో నాగ చైతన్యకు సమంత చెప్పిన విషెస్ గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. అవేంటో ఓ సారి చూద్దాం.

నాగ చైతన్యకు సమంతకు 2017 October 6న హిందూ సంప్రదాయంలో పెళ్లి జరిగింది. మళ్లీ మరునాడు క్రిస్టియన్ సంప్రదాయంలో వివాహాం జరిగింది. అయితే పెళ్లి అయిన తరువాత వచ్చిన మొదటి బర్త్ డే కావడంతో నాగ చైతన్య మీద తన ప్రేమనంతా కురిపించింది సమంత. నా సర్వస్వం నువ్వే.. నీకోసం నేను కోరుకోను.. ప్రతీ క్షణం, ప్రతీ రోజూ ప్రార్థిస్తాను.. నీ కోరికలన్నీ తీరాలని, సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తాను. ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అని పోస్ట్ వేసింది సమంత.

ఆ తరువాత ఏడాది అంటే 2018లో వేసిన పోస్ట్ కూడా అందరినీ ఆకట్టుకుంది. బ్లర్ ఇమేజ్‌లో భర్తకు ముద్దులు పెడుతున్న ఫోటోను సమంత అప్పుడు షేర్ చేసింది. మై ఫ్రెండ్, మై టీచర్, మై జెంటిల్ సోల్.. నా కోసమే పుట్టిన వాడివి నువ్వు అంటూ ఇలా సమంత అప్పట్లో చైతన్య మీద ప్రేమను కురిపించింది.

మళ్లీ ఆ తరువాత ఏడాది అంటే 2018లో ఇలా పోస్ట్ చేసింది.. నా చైతన్యకు హ్యాపీ బర్త్ డే.. నీ సంతోషం కోసం, నువ్ హ్యాపీగా ఉండాలని ప్రతీ క్షణం, ప్రతీ రోజూ ప్రార్థిస్తూనే ఉంటాను.. నువ్ రోజురోజుకూ ఇంకా ఎంతో మంచి వ్యక్తిగా పరిణతి చెందుతూనే ఉన్నావ్.. అది నాకు గర్వంగా అనిపిస్తోంది.. మనిద్దరం మరింత దగ్గరగా అవుతున్నామని నేను నమ్ముతున్నాను.. లవ్యూ డార్లింగ్ హజ్బండ్ అంటూ సమంత పోస్ట్ వేసింది.

ఇక విడిపోక ముందు అంటే.. చివరగా చెప్పిన విషెస్ అన్న మాట. 2020లో నాగ చైతన్య తన బర్త్ డేను మాల్దీవుల్లో సమంతతో పాటు స్పెషల్‌గా సెలెబ్రేట్ చేసుకున్నాడు. ఇక సమంత సైతం తన ఇన్ స్టా స్టోరీలో రొమాంటిక్ ఫోటోలను షేర్ చేసింది. ట్విట్టర్‌లో మాత్రం లవ్ స్టోరీ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను షేర్ చేస్తూ సింపుల్‌గా విషెస్ చెప్పింది. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అని సమంత పేర్కొంది.

ఇక 2021 అక్టోబర్‌లో విడిపోయిన తరువాత నాగ చైతన్యకు విషెస్ చెప్పడం మానేసింది సమంత. గత ఏడాది అయితే సమంత తన మాజీ భర్త చైతన్యకు విషెస్ చెప్పలేదు. కానీ తన పెట్ హష్ బర్త్ డేను మాత్రం గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసింది. మరి ఈ ఏడాది అయినా కూడా నాగ చైతన్యకు సమంత విషెస్ చెబుతుందా? లేదా? అన్నది చూడాలి.

సమంత నాగ చైతన్యల మధ్య ఒకప్పుడు అంత ప్రేమ ఉండేది. కానీ ఇప్పుడు ఆ ప్రేమ అంతా కూడా కనుమరుగైంది. ఇంత వరకు విడాకులకు సరైన కారణాలు ఏంటి? ఎవరిది తప్పు? ఎవరి వల్ల ఇదంతా జరిగింది? అనే విషయాలు మాత్రం రావడం లేదు. సమంత అయితే చైతన్య పట్ల కాస్త ద్వేషం, దురుసుగా ప్రవర్తిస్తున్నట్టు అనిపిస్తుంది. చైతూ మాత్రం సమంత విషయంలో ఎంతో సాఫ్ట్‌గానే మాట్లాడాడు.

Also Read : Jabardasth Varsha : వర్షించే అందం అంటే ఇదేనా?.. జబర్దస్త్ వర్ష వింత జాకెట్.. పిక్స్ వైరల్

Also Read : Jabardasth Ram Prasad : జబర్దస్త్ రాం ప్రసాద్‌కు ఏమైంది?.. అలా ఎందుకు కనిపించాడు.. పిక్స్ వైరల్‌

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News