Mahesh Babu with NBK: మహేష్ బాబుతో బాలయ్య బాబు Unstoppable

Mahesh Babu with NBK in Unstoppable talk show: ఆహా ఓటిటి ప్లాట్‌ఫామ్‌పై బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ షోలో మహేష్ బాబు (Mahesh Babu in Unstoppable with NBK) అతిథిగా విచ్చేయనున్నారని టాక్.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 1, 2021, 10:44 PM IST
Mahesh Babu with NBK: మహేష్ బాబుతో బాలయ్య బాబు Unstoppable

Mahesh Babu Unstoppable episode updates: బాలయ్య బాబు ఫ్యాన్స్ ప్రస్తుతం రెండు ఫన్ మూమెంట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. అందులో ఒకటి బాలయ్య బాబు హీరోగా వస్తున్న అఖండ మూవీ అయితే.. రెండోది నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న అన్‌స్టాపబుల్ టాక్ షోలో ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబును ఇంటర్వ్యూ చేస్తుండగా చూడటం. అవును.. నందమూరి బాలకృష్ణ సూపర్ స్టార్ మహేష్ బాబును ఇంటర్వ్యూ చేయనున్నట్టు తెలుస్తోంది. ఆహా ఓటిటి ప్లాట్‌ఫామ్‌పై బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ షోలో మహేష్ బాబు (Mahesh Babu in Unstoppable with NBK) అతిథిగా విచ్చేయనున్నారని టాక్. వీళ్లిద్దరికి సంబంధించిన అన్‌స్టాపబుల్ షో ఎపిసోడ్‌ను డిసెంబర్ 4న షూట్ చేయనున్నట్టు సమాచారం.

నందమూరి తారక రామా రావు తనయుడిగా బాలయ్య బాబు, అలనాటి సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ తనయుడిగా నేటి సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకే తెరపైకి వస్తే ఆ సీన్ ఎలా ఉంటుందా అని బాలయ్య బాబు, మహేష్ బాబు అభిమానులు (Mahesh Babu's fans, NBK fans) ఊహించుకుంటున్నారు. ఎన్టీఆర్, కృష్ణ కాలం నుంచి నేటి వరకు ఎన్నో సంచలన విషయాలు, కీలక అంశాలు ఈ టాక్ షోలో ప్రస్తావనకు వస్తాయనే అభిమానులు ఉన్నారు. 

Also read : Jr NTR, Mahesh Babu, Chiranjeevi donates: వరద బాధితులకు ఎన్టీఆర్, మహేష్ బాబు, చిరంజీవి విరాళాలు

ఇక ఇదిలావుంటే, అఖండ మూవీ రేపే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన ఈ సినిమా కోసం బాలయ్య బాబు ఫ్యాన్స్ ఎప్పటి నుంచి ఎదురుచూస్తున్నారు. అఖండ మూవీపై భారీ అంచనాలు ఉండటమే అందుకు కారణం. బాలయ్య బాబు, బోయపాటి కాంబోలో తెరకెక్కిన సింహ, లెజెండ్ చిత్రాలు భారీ బ్లాక్‌బస్టర్ హిట్ అవడంతో.. అఖండ మూవీపై (Akhanda movie trailer) కూడా మొదటి నుంచీ అలాంటి అంచనాలే ఉన్నాయి. 

అంతేకాకుండా ఇటీవలే రిలీజైన అఖండ ట్రైలర్‌లో డైలాగ్స్, బీజీ చూస్తే.. బాలయ్య బాబు అభిమానులకే కాదు.. ఆడియెన్స్ అందరికీ అఖండ మూవీపై ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఇన్ని అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న అఖండ మూవీ (Akhanda movie reviews in Telugu) అంచనాలను అందుకుంటుందా లేదా తెలియాలంటే ఇంకొన్ని గంటలు వేచిచూడాల్సిందే.

Also read : Mahesh Babu Knee Surgery: మహేష్ బాబు మోకాలికి సర్జరీ.. ట్విట్టర్ లో ట్రెండింగ్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News