Anasuya: ప్రముఖ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కు వచ్చేసిన అనసూయ లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ..

Anasuya: అనసూయ భరద్వాజ్, జగపతి బాబు ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘సింబా’. రీసెంట్ గా థియేట్రికల్ గా విడుదలైన ఈ చిత్రం మంచి వసూళ్లనే సాధించింది. తాజాగా ఈ సినిమా రెండు ఓటీటల్లోకి స్ట్రీమింగ్ కు వచ్చేసింది.  

Written by - TA Kiran Kumar | Last Updated : Sep 6, 2024, 01:39 PM IST
Anasuya: ప్రముఖ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కు వచ్చేసిన  అనసూయ లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ..

Anasuya - Simbaa Streaming: జబర్ధస్త్ యాంకర్ గా ఫేమసైన అనసూయ .. ప్రస్తుతం సినిమాల్లో కూడా రాణిస్తోంది. అంతేకాదు సినిమాల్లో అనసూయకు తగ్గ పాత్రలు లభిస్తున్నాయి. అంతేకాదు వెండితెరపై తనదైన శైలిలో దూసుకుపోతుంది. ఇక సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప సినిమాలో అనసూయ విలనిజానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు ఈమె ముఖ్యపాత్రల్లో పలు చిత్రాలు తెరకెక్కుతున్నాయి. అందులో కొన్ని చిత్రాలు ప్రేక్షకాదరణ కూడా పొందుతున్నాయి. తాజాగా అనసూయ జగపతి బాబుతో కలిసి నటించిన ‘సింబా’ మూవీ థియేట్రికల్ గా మంచి వసూళ్లనే రాబట్టింది. తాజాగా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్, ఆహా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అక్కడ ఈ సినిమా టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది.

Add Zee News as a Preferred Source

సైన్స్ ఫిక్షన్ క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమాలో అనసూయతో పాటు జగపతి బాబు, కస్తూరి, దివి, శ్రీనాథ్, కబీర్ సింగ్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని బయోజిలాజిక్ మెమరీ కాన్సెప్ట్ , పర్యావరణ సందేశంతో కలగలపి ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో ఒకరితో ఒకరికి సంబంధం లేని వ్యక్తులు స్కూల్ టీచర్ (అనసూయ), జర్నలిస్ట్ (శ్రీనాథ్), డాక్టర్ (అనీష్ కురువిళ్ళ) కలిసి కొన్ని హత్యలు చేస్తుంటారు. దాని వెనక ఎలాంటి మోటివ్ ఉంది.

పోలిస్ ఇన్వెస్టిగేషన్ లో హత్యలు వారి ప్రమేయం లేకుండా జరిగాయని తెలుస్తాయి. దీని వెనకాల పర్యావరణ ప్రేమికుడైన పురుషోత్తం రెడ్డి (జగపతిబాబు) అని తేలుతుంది. ఎపుడో చనిపోయాడనుకున్న వ్యక్తి వీళ్లను ఎలా చంపాడు. బయోలాజికల్ మెమరి అంటే ఏమిటి.. ? గతం వర్తమానంలోకి ఎలా వచ్చిందనే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కన ఈ సినిమా ప్రస్తుతం ఆహాతో పాటు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణమేమిటంటే..!

ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News