Anchor Ravi: షణ్మూని సిరి ఇష్టపడుతుంది: యాంకర్ రవి

Bigg Boss: సిరి- షణ్నూల రిలేషన్‌ పై రవి షాకింగ్ కామెంట్స్ చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రవి మాట్లాడుతూ...సిరి షణ్మూని ఇష్టపడుతుందని చెప్పాడు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 29, 2021, 06:51 PM IST
Anchor Ravi: షణ్మూని సిరి ఇష్టపడుతుంది: యాంకర్ రవి

Bigg Boss Telugu 5: బిగ్ బాస్ హౌస్(Bigg Boss )లో యాంకర్ రవి ఎలిమినేషన్ చాలా మందిని షాక్ కు గురిచేసింది. టాప్-5లో ఉంటాడనుకున్న రవి(Anchor Ravi) అనూహ్యంగా బయటకు వచ్చేయడం ...అతడిని అభిమానించే వారికి మింగుడు పడటం లేదు. దీనిపై సోషల్ మీడియా(Social Media)లో పెద్ద రచ్చే నడుస్తోంది. రవి మద్దతుగా చాలా మంది పోస్టులు పెడుతున్నారు.  అయితే హౌస్ నుంచి బయటకు వచ్చేసిన రవి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో సిరి-షణ్మూ రిలేషన్(Siri-Shannu Relation) పై షాకింగ్ కామెంట్స్ చేశాడు రవి. 

'షణ్మూ దీప్తిని ఎంత లవ్ చేస్తాడో.. సిరి చోటూని ఎంత లవ్ చేస్తుందో ఈ ఇద్దరికీ తెలుసు.. కానీ హౌస్‌లో సిరి షణ్నూని  ఇష్టపడుతుంది. ఈ విషయాన్ని స్వయంగా సిరినే చెప్పింది. అన్నా...ఐ లైక్‌ హిమ్‌ అని సిరి నాతో ఓపెన్‌అప్‌ అయ్యింది' అంటూ రవి చెప్పుకొచ్చాడు.

Also Read: Bigg Boss Telugu Season 5 Promo: ప్రియాంకకు బిగ్ బాస్ సీరియస్ వార్నింగ్.. ఏం జరిగింది?

ఇటీవల బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన సిరి అమ్మగారు..వారిద్దరీ రిలేషన్ షిప్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. షణ్మూ(Shanmukh) సిరిని హాగ్ చేసుకోవడం నచ్చట్లేదని బాహాటంగానే చెప్పేశారు. దీంతో షణ్మూ బాగా హర్ట్ అయ్యాడు. అదే విధంగా శనివారం బిగ్ బాస్ స్టేజ్ మీద వచ్చిన సిరి లవర్ శ్రీహాన్ కూడా...వదిలేస్తున్నావా సిరి(Siri) అంటూ డైలాగ్ వేశాడు. ఇది కాస్త సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయ్యింది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News