Ramnagar Bunny Movie Pre Release Event: రామ్ నగర్ బన్నీ మూవీతో ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమయ్యాడు ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్. విస్మయ శ్రీ, రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర హీరోయిన్స్‌గా నటింగా.. శ్రీనివాస్ మహత్ (వెలిగొండ శ్రీనివాస్) దర్శకత్వంలో తెరకెక్కింది. మలయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ నిర్మిస్తున్న ఈ చిత్రం.. ఈ నెల 4వ తేదీన థియేటర్లలో సందడి మొదలుపెట్టనుంది. ఈ నేపథ్యంలోనే నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకకు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ మూవీ టీజర్, ట్రైలర్ చూస్తే.. మంచి కంటెంట్‌తో వస్తున్నట్లు అర్థమవుతోందన్నారు. ఈ మూవీ చంద్రహాస్‌తో పాటు ప్రభాకర్‌కు పెద్ద హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
Also Read: Bathukamma 2024: మొదటిరోజు ఎంగిలి పూల బతుకమ్మ.. ఆ పేరు ఎలా వచ్చిందంటే..?
హీరో చంద్రహాస్ మాట్లాడుతూ.. తాను మూడు ప్రామిస్‌లు చేస్తున్నానని.. రామ్ నగర్ బన్నీ మూవీ లాభాల్లో 10 శాతం ప్రజల ఛారిటీకి ఇచ్చేస్తానని చెప్పాడు. ఈ మూవీ చూసిన తరువాత ఆటిట్యూట్ స్టార్ అనే ట్యాగ్‌కు తాను అర్హుడిని కాదంటే తన తరువాతి రెండు చిత్రాలకు ఆ పేరు పెట్టుకోనని స్పష్టం చేశాడు. మూడోది ఈ సినిమా చూసిన నచ్చకపోతే.. టికెట్ ఫొటోతో ఇన్ స్టా ద్వారా చెబితే డబ్బులు కచ్చితంగా గూగుల్ పే చేస్తానని చెప్పాడు. గత రెండేళ్లుగా తనను ఎంతో నెగిటివ్‌గా ప్రచారం చేశారని.. అయినా తాను అన్నింటిని పాజిటివ్‌గా తీసుకున్నానని అన్నాడు. ప్రతి ఒక్కరు ఈ మూవీని చూడాలని.. తనలోని నెగిటివ్స్ చెబితే నెక్ట్స్ మూవీకి మార్చుకుంటానని అన్నాడు. ప్రతి మూవీకి బెస్ట్ ఔట్పుట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తానన్నాడు.
నిర్మాత ప్రభాకర్ మాట్లాడుతూ.. రామ్ నగర్ బన్నీ సినిమాకు ఎంతోమంది సపోర్ట్ చేశారని గుర్తు చేసుకున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 4న ఆడియన్స్ ముందుకు వస్తుందని.. ఇంతకాలం తనను ఆదరించిన తల్లులు, అక్కా చెల్లెల్లు రామ్ నగర్ బన్నీ సినిమాను చూసి ఆదరించాలని కోరారు. తప్పకుండా ఆదరిస్తారని నమ్మకం ఉందన్నారు. హీరోయిన్స్ విస్మయ శ్రీ, రిచా జోషి, రీతు, అంబికా వాణి మాట్లాడుతూ.. చంద్రహాస్ మంచి కోస్టార్ అని చెప్పారు. ఈ మూవీ లవ్ అండ్ ఎంటర్టైన్మెంట్తో ఆకట్టుకుంటుందన్నారు. ఈ మూవీని ప్రతి ఒక్కరు థియేటర్స్‌లో చూడాలని కోరారు.
డైరెక్టర్ శ్రీనివాస్ మహత్ (వెలిగొండ శ్రీనివాస్) మాట్లాడుతూ.. ఈ సినిమాలో చంద్రహాస్ డ్యాన్స్, ఫైట్స్, పర్ఫార్మెన్స్ ఇలా అన్నింటిలో బెస్ట్ ఇచ్చారని అన్నారు. అశ్విన్ మంచి మ్యూజిక్ ఇచ్చారని.. కొరియోగ్రాఫర్స్, ఫైట్ మాస్టర్స్ అందరూ ది బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చారని చెప్పుకొచ్చారు. తమ టీమ్ కంటే ప్రొడ్యూసర్ ప్రభాకర్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారని చెప్పారు. ఈ సినిమా ప్రతి ఒక్కరినీ బాగా నచ్చుతుందన్నారు.
Also Read: Prediabetes Reversal tips: ప్రీ డయాబెటిస్ అంటే ఏంటి, రివర్సల్ చేయగలమా లేదా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.