Jeremy Renner Met Accident : అవెంజర్స్ నటుడు జెరెమీ రెన్నర్‌కు ప్రమాదం.. పరిస్థితి ఎలా ఉందంటే?

Hollywood Actor Accident మంచు చరియలు పడటంతో హాలీవుడ్ నటుడు ప్రమాదానికి గురయ్యాడు. ఇంటి వెనుకున్న మంచుని తీసే క్రమంలో అవి పడ్డాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగానే ఉన్నా కూడా ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని సమాచారం.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 2, 2023, 08:08 PM IST
  • హాలీవుడ్ నటుడిక ప్రమాదం
  • ఆస్పత్రిలో హాక్ ఐ పాత్రధారి
  • జెరెమీ రెన్నెర్‌ పరిస్థితి ఎలా ఉందంటే?
Jeremy Renner Met Accident : అవెంజర్స్ నటుడు జెరెమీ రెన్నర్‌కు ప్రమాదం.. పరిస్థితి ఎలా ఉందంటే?

Jeremy Renner Accident అవెంజర్స్ సీరిస్‌లో హాక్ ఐ పాత్రతో అందరినీ మెప్పించిన హాలీవుడ్‌ నటుడు జెరెమీ రెన్నెర్‌కు ప్రమాదం ఎదురైంది. ఈ కొత్త ఏడాది మొదటి రోజునే ప్రమాదానికి గురయ్యాడు. తన ఇంటి వెలుపల మంచును తొలగిస్తుండగా ప్రమాదానికి గురయ్యాడని తెలుస్తోంది. ఆ ప్రమాదం తీవ్రంగా ఉండటంతో చికిత్స కోసం విమానంలో హాస్పిటల్‌కు తరలించారు. ఇక ఈ విషయం తెలియడంతో ఆయన అభిమానులు దేవుడికి ప్రార్థనలు చేస్తున్నారు. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

అయితే జెరెమీ రెన్నర్‌ మాత్రం ప్రస్తుతం క్షేమంగానే ఉన్నాడని, పరిస్థితి తీవ్రంగా ఉందని మొదట సమాచారం వచ్చినా.. వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తుండటంతో కోలుకుంటున్నాడని తెలుస్తోంది. దీంతో అభిమానులకు కాస్త ఉపశమనం లభించినట్టు అయింది. అయితే ప్రస్తుతం మాత్రం ఆరోగ్యం క్రిటికల్ అయినా స్టేబుల్‌గానే ఉందని వైద్యులు చెబుతున్నారట.

హాక్ ఐ పాత్రకు ఎంతో మంది అభిమానులుంటారు. ఎంతో పవర్ ఫుల్ అయిన ఈ పాత్ర అవెంజర్స్ పార్టులో ఎంతో కీలకం. అవెంజర్స్ ఎండ్ గేమ్‌లోనూ ఈ కారెక్టర్ ఉంటుంది. బాణాలు వేయడం, శత్రువులను మట్టుబెట్టడంతో హాక్ ఐ పాత్ర కీలకంగా ఉంటుంది.

Also Read: Kalyaan Dhev New Year Post : ఈ ఏడాదిలో ఎన్నో నేర్చుకున్నా.. కళ్యాణ్‌ దేవ్ ఎమోషనల్ పోస్ట్

Also Read: Heroine Poorna Pregnant : తల్లి కాబోతోన్న హీరోయిన్ పూర్ణ.. అందుకే వాటికి దూరమైందా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News