NBK107: బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్ ఇదే... ఇక ఫ్యాన్స్‌కు పూనకాలే!

NBK107 : నందమూరి బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబోలో NBK107 వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు టైటిల్ ను ఫిక్స్ చేశారు మేకర్స్.  

Edited by - ZH Telugu Desk | Last Updated : May 26, 2022, 04:16 PM IST
NBK107: బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్ ఇదే... ఇక ఫ్యాన్స్‌కు పూనకాలే!

Balakrishna and Gopichand Malineni Movie Title : నట సింహం బాలకృష్ణ (Balakrishna), క్రేజీ డైరెక్టర్ గోపిచంద్ మలినేని (Gopichand Malineni) కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. NBK107 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాకు ఎట్టకేలకు టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తోంది. అఖండ సినిమాకు అద్భుతమైన పాటలను  ఇచ్చిన తమన్...ఈ సినిమాకు కూడా సంగీతం అందించనున్నారు. ఈ సినిమాలో కన్నడ హీరో దునియా విజయ్ ప్రతినాయకుడిగా చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేనీ, వై రవిశంకర్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. 

నందమూరి బాలకృష్ణను అభిమానులు ముద్దుగా 'జై బాలయ్య' (Jai Balayya) అని పిలుచుకుంటారు. తాజాగా ఈ పేరునే NBK107 ఫిక్స్ చేసినట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో నడుస్తుందని టాక్. ఈ చిత్రానికి ఆరంభంలో 'అన్నగారు' అనే టైటిల్‌ను కూడా అనుకున్నారట. కానీ ఆ పేరును అనిల్ రావిపూడి-బాలయ్య కాంబోలో తెరకెక్కే సినిమా కోసం వాడనున్నట్లు తెలుస్తోంది. 'అఖండ' సూపర్ సక్సెస్ తర్వాత బాలయ్య చేస్తున్న సినిమాకావడంతో...దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి.  

Also Read: Thank You Teaser: లైఫ్‌లో కాంప్రమైజ్‌ అయ్యే ప్రసక్తే లేదు.. ఎన్నో వ‌దులుకొని ఇక్క‌డికొచ్చా: నాగ చైతన్య 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News