Bhale Unnade Movie Review: ‘భలే ఉన్నాడే’ మూవీ రివ్యూ.. రాజ్ తరుణ్ మెప్పించాడా..!

Bhale Unnade Movie Review: రాజ్ తరుణ్ గత కొన్నేళ్లుగా తన సినిమాల కంటూ కాంట్రవర్సీలతో వార్తల్లో నిలుస్తున్నాడు. ఎన్ని కాంట్రవర్సీలున్న వరుస సినిమాలతో రచ్చ చేస్తూనే ఉన్నాడు. తాజాగా ‘భలే ఉన్నాడే’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉందో మన మూవీ రివ్యూలో చూద్దాం..

Written by - TA Kiran Kumar | Last Updated : Sep 13, 2024, 07:50 AM IST
Bhale Unnade Movie Review: ‘భలే ఉన్నాడే’ మూవీ రివ్యూ.. రాజ్ తరుణ్ మెప్పించాడా..!

మూవీ రివ్యూ: భలే ఉన్నాడే (Bhale Unnade)
నటీనటులు: రాజ్ తరుణ్, మనీషా కందుకూర్, శ్రీకాంత్ అయ్యంగార్, హైపర్ ఆది, రచ్చ రవి, గణేష్
తదితరులు
ఎడిటర్:  శ్రీకాంత్ పట్నాయక్
సినిమాటోగ్రఫర్: నగేష్ బాణేల్
మ్యూజిక్:శేఖర్ చంద్ర
నిర్మాత: ఎన్.వి.కిరణ్ కుమార్
దర్శకత్వం: శివసాయి వర్ధన్

 

రాజ్ తరుణ్ కేరాఫ్ కాంట్రవర్సీ అయినా.. వరుస చిత్రాలతో ఆడియన్స్ ను పలకరిస్తూనే ఉన్నాడు. తాజాగా యంగ్ హీరో రాజ్ తరుణ్. నా సామి రంగ, పురుషోత్తముడు, తిరగబడరాసామీ అంటూ ఇటీవల వరుస చిత్రాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్  చేసాడు. తాజాగా ఇపుడు ‘భలే ఉన్నాడే’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమాతో రాజ్ తరుణ్ కోరుకున్న హిట్ అందుకున్నాడా ? లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

కథ విషయానికొస్తే..
రాధా(రాజ్ తరుణ్)... శారీ ర్యాపర్ గా పనిచేస్తూ ఉంటాడు. చీరలోనే అమ్మాయిల అందం మరింత అందంగా ఉంటుందని చెబుతూ
అమ్మాయిల పెళ్లిళ్లకు, ఎంగేజ్మెంట్ ఫంక్షన్స్ కు అమ్మాయిలకు చీరలు కడుతూ జీవితం కొనసాగిస్తూ ఉంటాడు. చిన్నపుడే తండ్రిని కోల్పోయిన రాధా తల్లి (అభిరామి) పెంపకంలో పెరిగి పెద్దవాడవుతాడు. తల్లి బ్యాంకులో జాబ్ చేస్తూ జీవితం కొనసాగిస్తూ ఉంటుంది. అదే బ్యాంకులో కృష్ణ(మనీషా కందుకూర్) పనిచేస్తూ ఉంటుంది. కొత్త ఉద్యోగంలో చేరిన కృష్ణ.. రాధా తల్లి గౌరీకి దగ్గరవుతుంది. గౌరీ తెచ్చే లంచ్ బాక్స్ కి బాగా కనెక్ట్ అయిన కృష్ణకి... ఆ భోజనం చేస్తున్నది తాను కాదని చెబుతుంది. అంతేకాదు ఈ వంటకం అంతా తన కుమారుడు చేస్తున్నాడని చెప్పడంతో రాధాని చూడాలనుకుంటుంది కృష్ణ. అంతేకాదు అతన్ని గోముగా ప్రేమిస్తుంది. ఈ క్రమంలో
తన స్నేహితురాలు ఓ సందేహం వెలిబుచ్చితుంది. ఇలాంటి అలవాట్లు ఉన్న రాధా సంసారానికి పనికి వస్తాడా రాడా అనేది తెలుసుకోవాలనుకుంటుంది. ఈ క్రమంలో రాధా, కృష్ణల మధ్య ఎలాంటి పొరపొచ్చాలు ఏర్పడ్డాయి. చివరకు వీళ్లిద్దరు ఒకటయ్యారా.. లేదా  అనేదే ‘భలే ఉన్నాడే’ మూవీ స్టోరీ.

కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
గతంలో దర్శకుడు మారుతి సమర్పణలో వచ్చిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలే అందుకున్నాయి. ఈ కోవలో వచ్చిన మరో కామెడీ ఎంటర్టైనర్ ‘భలే ఉన్నాడే’. ఈ సినిమా స్టోరీ లైన్ తోనే సగం విజయం సాధించాడు. ఈ మధ్యకాలంలో అబ్బాయిలు మంచిగా ఉంటే... ‘వీడు తేడా’ అని అమ్మాయిలు అనుమానించే పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాంటి పాయింట్ ను బేస్ చేసుకుని దాని చుట్టూ రాసుకున్న ఎంటర్టైనింగ్ స్క్రీన్ ప్లే తో ఈ సినిమాను నడిపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎమోషన్ కూడా భారీగానే క్యారీ అయింది. షార్ట్ ఫిల్మ్స్ తో దర్శకుడిగా పలు చిత్రాలను తెరకెక్కించిన శివసాయి సిల్వర్ స్క్రీన్ పై తొలి చిత్రంతోనే మంచి సక్సెస్ అందుకున్నాడు. షార్ట్ ఫిల్మ్స్ తీసిన అనుభవంతో ఎక్కడ ఎంత నిడివి ఉండాలో అంతే నిడివితో చక్కగా తెరపై ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఒకవైపు హీరో, హీరోయిన్స్ మధ్య లవ్ స్టోరీని ఎంటర్టైన్మెంట్ గా నడిపించాడు. అటు తల్లికొడుకుల మధ్య అనురాగాన్ని సమపాళ్లలో రంగరంగి ఎమోషన్ ను క్యారీ చేసాడు. మధ్యలో హైపర్ ఆది ఎపిసోడ్ పంటి కింద రాయిలా ఉన్న ఓవరాల్ గా బాగుంది. ఈ సినిమా స్టోరీకి రాజ్ తరుణ్ పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడనే చెప్పాలి.

ముఖ్యంగా ఈ జనరేషన్ లో కొంత మంది అబ్బాయిలు చెడు అలవాట్లకు దూరంగా ఉంటున్నారు. అటు అమ్మాయిలకు దూరంగా ఉంటూ, ఇంట్లో వాళ్లకు హెల్ప్ చేస్తుంటే ఎందుకు చేతకానివాడిలాగా చూసే జమానా వచ్చి పడింది. వాడు అబ్బాయే కాదు అనేలా చూస్తున్నారు అనే పాయింట్ ని చాలా చక్కగా తెరపై ప్రెజెంట్ చేసాడు దర్శకుడు. అలాగే పెళ్ళికి ముందే తప్పు చేసి కష్టాలు పడుతున్నారు అనే అంశాన్ని ఎమోషనల్ గా ఆలోచించే విధంగా చూపించారు. దర్శకుడు ఇప్పటి యువతరం ఆలోచనలు ఎలా వుంటాయనేదాన్ని పాయింట్ గా తీసుకుని అంతే చక్కగా తెరకెక్కించాడు.  ఓ కొత్త కథని సింపుల్ స్క్రీన్ ప్లేతో ఫ్రెష్ గా చూపించాడు. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. అన్ని పాటలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఓ మోస్తారుగా ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.  

నటీనటుల విషయానికొస్తే..

రాజ్ తరుణ్ ఈ సినిమాలో ఎంతో ఈజ్ తో పక్కటి కుర్రాడి పాత్రలో  అద్భుతంగా ఒదిగిపోయాడు.  శారీ ర్యాపర్ గా ఆ క్యారెక్టర్ లో జీవించాడు.  చాలా రోజుల తర్వాత రాజ్ తరుణ్ మంచి నటన కనబరిచాడు. మనీషా కందుకూర్ కూడా తన పాత్రలో మెప్పించింది. గ్లామర్ తో కూడా మెప్పించింది.  అమ్మ పాత్రలో ఒకప్పటి హీరోయిన్ అభిరామి ఒదిగిపోయిన తీరు అభినందనీయం. గెస్ట్ పాత్రలో లెజెండరీ డైరెక్టర్  సింగీతం శ్రీనివాస్, లీలా శ్యాంసన్ పాత్ర ఒకే. హైపర్ ఆది, సుదర్శన్, తమిళ్ స్టార్ కమెడియన్ VTV గణేష్ అక్కడక్క నవ్వులు పూయించారు. మిగిలిన నటీనటులు వారి పాత్రల పరిధిమేరకు నటించి మెప్పించారు.

ఆకట్టుకునే ‘భలే ఉన్నాడే  మూవీ

రేటింగ్: 2.75/5

ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News