Bimbisara Director to Rajanikanth: నక్క తోక తొక్కిన బింబిసార డైరెక్టర్.. ఏకంగా రజనీకాంత్ కే నెరేషన్?

Bimbisara Director Mallidi Vasishta Narrated a Story to Rajanikanth: బింబిసార దర్శకుడు మల్లిడి వశిష్ట​ రజనీకాంత్ కు కథ నెరేట్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Oct 20, 2022, 01:27 PM IST
Bimbisara Director to Rajanikanth: నక్క తోక తొక్కిన బింబిసార డైరెక్టర్.. ఏకంగా రజనీకాంత్ కే నెరేషన్?

Bimbisara Director Mallidi Vasishta Narrated a Story to Rajanikanth: మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న దర్శకులు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. అలాంటి వారిలో బింబిసార దర్శకుడు మల్లిడి వశిష్ట కూడా ఒకరు నిజానికి ఆయన ఒకప్పటి స్టార్ ప్రొడ్యూసర్ మళ్ళీ సత్యనారాయణ కుమారుడు మల్లిడి వేణుగా ‘ప్రేమలేఖ రాశా’ అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. గీత రచయిత కులశేఖర్ దర్శకుడిగా మారి ఈ సినిమాను తెరకెక్కించారు.

స్వయంగా మళ్ళీ సత్యనారాయణ నిర్మాతగా మార్చేసిన ఈ సినిమా అప్పట్లో డిజాస్టర్ గా నిలిచింది. అంజలి హీరోయిన్గా విడుదలైన ఈ సినిమా అసలు విడుదలైన సంగతి కూడా చాలా మందికి తెలియదు. దీంతో ఇక హీరోగా మనకి వర్కౌట్ కాదనుకున్న వేణు సైలెంట్ అయిపోయి పలువురు దర్శకుల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పలు సినిమాలకు పనిచేసి సొంతంగా కధ సిద్ధం చేసుకున్నాడు. కళ్యాణ్ రామ్ లాంటి హీరోతో బింబిసార లాంటి ప్రాజెక్టు చేయడం రిస్క్ అని తెలిసిన ఆ రిస్క్ చేసి స్వయంగా కళ్యాణ్ రామ్ చేత డబ్బులు పెట్టించి, రిస్క్ చేయించి హిట్టు కొట్టాడు.

ఇక ఈ సినిమా సీక్వెల్ ఉంటుందని మొదటి భాగం చివర్లోనే క్లారిటీ ఇచ్చారు, అయితే ఈ సీక్వెల్ ఎప్పుడు మొదలు పెడతారు అనే విషయం మీద మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. ఇక తాజాగా టాలీవుడ్ ఫిలిం వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు వేణు ఇటీవల చెన్నై వెళ్లి రజినీకాంత్ ని కలిసినట్లు తెలుస్తోంది. బింబిసార టాక్ తెలుసుకున్న రజనీకాంత్ వేణు కథ చెప్పడానికి వస్తున్నానంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అలా చెన్నై వెళ్లిన వేణు, రజినీకాంత్ కి తన కథ వినిపించారని తెలుస్తోంది. కథ మొత్తం విన్న తర్వాత రజనీకాంత్ ప్రస్తుతానికి అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని అలా అని రెడ్ సిగ్నల్ కూడా ఇవ్వలేదని తెలుస్తోంది.

కథ వినిపించిన తర్వాత రజినీకాంత్ ఎగ్జయిట్ అయ్యారని, త్వరలోనే ఫైనల్ కాల్ ఏమిటనే విషయం మీద క్లారిటీ ఇస్తానని వేణుకి చెప్పి పంపించినట్లు తెలుస్తోంది. ఒకవేళ వేణుకి రజినీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే ఆయన దశ తిరిగినట్లు చెప్పాలి. మొదటి సినిమాతోనే కళ్యాణ్ రామ్ హీరోగా బింబిసారతో హిట్టు ఆయన ఇప్పుడు ఏకంగా రజినీకాంత్ సినిమా ఫైనల్ అయితే కనుక ఆయన కెరీర్ ఇంకెక్కడికో వెళ్లి పోవడం ఖాయం అనే మాట వినిపిస్తోంది. అయితే రజనీకాంత్ బింబిసార గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? ఇవ్వరా? అనే విషయం మీద మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.

Also Read: NBK 107 Title: అన్నగారు ? రెడ్డి గారు? ఆ టైటిల్ కే మొగ్గు చూపుతున్న 107 మేకర్స్

Also Read: Unstoppable With NBK: మూడో ఎపిసోడ్ కు కూడా ఇద్దరు కుర్ర హీరోలు.. ఎవరెవరంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News