NBK 107 Title: అన్నగారు ? రెడ్డి గారు? ఆ టైటిల్ కే మొగ్గు చూపుతున్న 107 మేకర్స్

Veerasimha Reddy title Fixed for NBK 107: నందమూరి బాలకృష్ణ 107 టైటిల్ అనౌన్స్ మెంట్ కు ముహూర్తం ఖరారయింది.. ఇక ఆ టైటిల్ కూడా ఇప్పటికే ఫైనల్ చేసినట్టు చెబుతున్నారు. 

Written by - Chaganti Bhargav | Last Updated : Oct 20, 2022, 10:11 AM IST
NBK 107 Title: అన్నగారు ? రెడ్డి గారు? ఆ టైటిల్ కే మొగ్గు చూపుతున్న 107 మేకర్స్

Veerasimha Reddy title Fixed for NBK 107: అఖండ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తన 107వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో పూర్తిస్థాయి మాస్ మసాలా పాత్రలో బాలకృష్ణ కనిపిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన కొన్ని లుక్స్ అలాగే పోస్టర్లు నందమూరి బాలకృష్ణ కెరియర్ లో ఇది ఒక బెస్ట్ ఫ్యాక్షన్ ఎంటర్టైనర్ గా నిలుస్తుందని హింట్స్ ఇస్తున్నాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు నిర్మాతలు.

ఇప్పటివరకు తెలుగు సినీ చరిత్రలో లేనివిధంగా ఒక సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ కి కూడా ఒక ఈవెంట్ నిర్వహిస్తోంది సినిమా యూనిట్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ సినిమాను గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్నాడు. క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకుని మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన గోపీచంద్ మలినేని ఈ సినిమాలో బాలకృష్ణ సరసన తనకు బాగా కలిసి వచ్చిన హీరోయిన్ శృతిహాసన్ తీసుకున్నారు. ఇక ఈ సినిమాలో కన్నడ సీనియర్ హీరో దునియా విజయ్ విలన్ పాత్రలో నటిస్తుండగా వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో నటిస్తోంది.

ఈ సినిమా టైటిల్ అనౌన్సమెంట్ ఫంక్షన్ కర్నూలు జిల్లా కొండారెడ్డి బురుజు వద్ద ఘనంగా జరగబోతోంది. ఇక ఈ సినిమాకు అన్నగారు, వీర సింహారెడ్డి, రెడ్డి గారు అనే టైటిల్స్ పరిశీలనలో ఉండగా వీరసింహారెడ్డి టైటిల్ కి మేకర్స్ మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నెలకొన్న కొన్ని రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ పేరు కరెక్ట్ గా ఉండదేమో అని భావిస్తూ అన్నగారు అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేయించుకుని ఉంచారని, ఇప్పటికే బాలయ్య ఫిక్స్ చేసిన ముహూర్తానికి ఈ టైటిల్ అనౌన్స్ చేయనున్నారని ప్రచారం జరుగుతోంది.

ఇందులో నిజానిజాలు ఏ మేరకు ఉన్నాయి అనే విషయం మీద క్లారిటీ లేదు కానీ దీనికి సంబంధించిన ప్రచారం అయితే టాలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతోంది. అఖండ సినిమాతో బాలకృష్ణ సూపర్ హిట్ అందుకోగా ఈ సినిమాతో కూడా ఖచ్చితంగా హిట్టు కొడతాడని ఆయన అభిమానులు చాలా నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. దానికి తోడు ఆయన ఆన్ స్టాపబుల్ అనే ఒక షో తో కూడా ప్రేక్షకులకు బాగా దగ్గరైన నేపథ్యంలో ఆ ఎఫెక్ట్ కూడా తమ సినిమాకు బాగా కలిసి వస్తుందని ఒకప్పుడు బాలకృష్ణను ద్వేషించే వాళ్ళు సైతం ఇప్పుడు ఆయనకు అభిమానులుగా మారిపోయారు.

కాబట్టి కచ్చితంగా ఈ సినిమా బాలకృష్ణ కెరియర్ లో ది బెస్ట్ మూవీగా నిలిచిపోయే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇది పూర్తిస్థాయి కమర్షియల్ సినిమా కావడంతో అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుందని సినీ నిర్మాతలు కూడా భావిస్తున్నారు. ఇందులో నిజా నిజాలు ఏమేరకు ఉన్నాయి అనేది చూడాల్సి ఉంది.
Also Read: Sapthami Gowda Allu Aravind: అల్లు అరవింద్ కాళ్లపై పడిన హీరోయిన్.. సోషల్ మీడియాలో వైరల్!

Also Read: Meera Jasmine Hot Photos: అంతా కనిపించేలా వింత డ్రెస్సులో దర్శనమిచ్చిన మీరా జాస్మిన్.. లేటు వయసులోనూ ఘాటు ఫోజులు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News