డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలున్నాయంటున్న బ్లఫ్ మాస్టర్ ట్రైలర్

Last Updated : Dec 8, 2018, 05:24 PM IST
డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలున్నాయంటున్న బ్లఫ్ మాస్టర్ ట్రైలర్

దేశంలోని ఆర్థిక నేరగాళ్లంతా నేరుగా దోపిడీలు, హత్యలకు పాల్పడకుండానే వేల కోట్లు ఎలా దోచుకుంటున్నారో తెలియజెప్పే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమా బ్లఫ్ మాస్టర్. గోపీ గణేష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ తాజాగా ఆడియెన్స్ ముందుకొచ్చింది. సత్యదేవ్, నందిత శ్వేత ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని అభిషేక్ ఫిలింస్ బ్యానర్‌పై రమేష్ పి పిల్లై నిర్మించగా సునీల్ కశ్యప్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. ''డబ్బు సంపాదించడానికి దోపిడీలు, హత్యలే చేయక్కర్లేదు.. చట్టంలోని లొసుగులు అడ్డం పెట్టుకుని కూడా సంపాదించొచ్చు, సగం ధరకే తులం బంగారం ఇస్తామంటే జనాలు ఎలా ఎగబడతారో చూడండి, డబ్బును మనం సంపాదిస్తే, ఆ తర్వాత డబ్బే డబ్బును సంపాదిస్తుంది, డబ్బే డస్టర్‌గా మారి తనపై వున్న అభియోగాలను తుడిచేస్తుంది'' వంటి ఆసక్తికరమైన డైలాగ్స్ సినిమా బ్యాక్‌డ్రాప్ ఏంటో చెప్పకనే చెబుతున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం.. బ్లఫ్ మాస్టర్ ట్రైలర్‌పై మీరూ ఓ లుక్కేసేయండి. 

Trending News