Chalapathi Chowdary Death: టాలీవుడ్ లో విషాదం.. కెప్టెన్ చలపతి చౌదరి కన్నుమూత!

Chalapathi Chowdary Death: టాలీవుడ్ సీనియర్ నటుడు కెప్టెన్ చలపతి చౌదరి (67) కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 20, 2022, 04:32 PM IST
Chalapathi Chowdary Death: టాలీవుడ్ లో విషాదం.. కెప్టెన్ చలపతి చౌదరి కన్నుమూత!

Chalapathi Chowdary Death: టాలీవుడ్ లో విషాదం నెలకొంది. సీనియర్ నటుడు కెప్టెన్ చలపతి చౌదరి (67) కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఇటీవలే కర్ణాటక రాయ్ చూర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 

కెప్టెన్ చలపతి చౌదరి మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. కెప్టెన్ చలపతి చౌదరి.. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడకు చెందిన ఈయన, కర్ణాటకలోని రాయ్ చూర్ లో స్థిరపడ్డారు. టాలీవుడ్ తో పాటు కన్నడ, తమిళ బాషల్లో వందకు పైగా చిత్రాల్లో నటించారు. 

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, కన్నడ లెజెండరీ యాక్టర్ శివరాజ్ కుమార్ వంటి స్టార్ హీరోల పక్కన కీలక పాత్రలు పోషించారు. సినిమాలతో పాటు బుల్లితెరపై ప్రసారమయ్యే పలు సీరియల్స్ పై చలపతి చౌదరి నటించారు. ఈయన చివరిగా బాలకృష్ణ నటించిన 'అఖండ' మూవీలో కీలక పాత్ర నటించారు. 

Also Read: NTR 31 Movie Poster: ఉగ్రరూపంలో తారక్.. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా అప్డేట్ వచ్చేసింది!

Also Read: NTR Birthday: నువ్వు నాకెవరో అని ఒక్క పదంలో నిర్వచించలేను.. తారక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News