Lokesh Kanagaraj Ram Charan : రామ్ చరణ్‌తో సినిమా ఉంటుంది కానీ.. లోకేష్ కనకరాజ్ కామెంట్స్

Lokesh Kanagaraj Ram Charan లోకేష్ కనకరాజ్ రామ్ చరణ్‌ కాంబోలో సినిమా రావాలని అంతా అనుకుంటున్నారు. ఇక విక్రమ్‌ సినిమాలో చిన్న బుడ్డోడు రామ్ చరణ్‌ అవుతాడని అప్పట్లో టాక్ కూడా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 4, 2023, 04:11 PM IST
  • లియో సినిమాతో ట్రెండింగ్‌లో లోకేష్
  • లోకేష్ సినిమాటిక్ యూనివర్సిటీలో చెర్రీ?
  • రామ్ చరణ్‌తో లోకేష్ కనకరాజ్
Lokesh Kanagaraj Ram Charan : రామ్ చరణ్‌తో సినిమా ఉంటుంది కానీ.. లోకేష్ కనకరాజ్ కామెంట్స్

Lokesh Kanagaraj Ram Charan లోకేష్ సినిమాటిక్ యూనివర్సిటీలోకి జాయిన్ అవ్వాలని స్టార్ హీరోలంతా కోరుకుంటున్నారు. విక్రమ్ సినిమా తరువాత కమల్ హాసన్‌ పుల్‌ జోష్‌లోకి వచ్చాడు. విక్రమ్ సినిమా అంత పెద్ద హిట్ అవుతుందని ఎవ్వరూ అనుకోలేదు. నాలుగు వందల కోట్లు కొల్లగొట్టేయడంతో కమల్ హాసన్ సైతం ఆశ్చర్యపోయినట్టున్నాడు. అయితే ఇప్పుడు లోకేష్ చేతిలో వచ్చే పదేళ్లకు సరిపడా కథలున్నాయి. లోకేష్‌ సినిమాటిక్ యూనివర్సిటీలో భాగంగా ప్రాంచైజీలు, సీక్వెల్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయని అర్థమవుతోంది.

ఇప్పుడు అయితే విజయ్‌తో లియో అనే సినిమాను చేస్తున్నాడు. ఆ తరువాత ఖైదీ 2 అంటూ కార్తీతో మరో సినిమాను చేసేట్టు కనిపిస్తోంది. ఆ తరువాత రామ్ చరణ్‌తో సినిమా చేస్తాడా? లేదా విక్రమ్ సినిమాకు సీక్వెట్ చేస్తాడా? రోలెక్స్ పాత్రకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ చూపిస్తాడా? అన్నది తెలియాల్సి ఉంది.

అయితే రామ్ చరణ్‌తో లోకేష్‌ సినిమా చేయబోతోన్నాడనే రూమర్లు ఎప్పటి నుంచో వస్తూనే ఉన్నాయి. ఈ ఇద్దరి మధ్య చర్చలు కూడా జరిగాయి. ఇదే విషయాన్ని లోకేష్ చెప్పుకొచ్చాడు. అంత బాగా రిసీవ్ చేసుకుంటాడని అనుకోలేదు.. తామిద్దరం కలిసి సినిమా చేస్తాం కానీ ఇప్పుడే కుదరకపోవచ్చు.. నాకు ఇప్పుడు రెండు మూడు కమిట్మెంట్లున్నాయి.. రామ్ చరణ్‌ గారికి కూడా రెండు మూడు కమిట్మెంట్లున్నాయి.. అవన్నీ పూర్తయ్యాక మేం ఇద్దరం కలిసి సినిమా చేసే అవకాశం ఉందని లోకేష్ చెప్పుకొచ్చాడు.

రామ్ చరణ్‌ ఇప్పుడు శంకర్ సినిమాను చేస్తున్నాడు. ఆ తరువాత బుచ్చిబాబు సానాతో ఓ ప్రాజెక్ట్ ఉంది. దాని తరువాత ప్రశాంత్ నీల్‌తో ఉంటుందా? లోకేష్‌ కనకరాజ్‌తో ఉంటుందా? అన్నది చూడాలి. ఇప్పుడు అయితే లియో సినిమాను భారీ ఎత్తున ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది.

Also Read:  Butta Bomma Movie Review: అనిఖా సురేంద్రన్- అర్జున్ దాస్ 'బుట్టబొమ్మ' రివ్యూ... హిట్ కొట్టారా?

Also Read: NTR 30 Update : డెడ్ లైన్ పెట్టిన ఎన్టీఆర్.. సిద్దంగా ఉన్న కొరటాల

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x