Ranbir Kapoor: స్టార్ హీరో సినిమా సెట్లో అగ్నిప్రమాదం.. వ్యక్తి మృతి!

Fire accident at ranbir kapoor movie shooting spot: రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఒక సినిమా సెట్ లో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో  సెట్ బాయ్ మరణించారని గుర్తించారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 30, 2022, 09:32 AM IST
Ranbir Kapoor: స్టార్ హీరో సినిమా సెట్లో అగ్నిప్రమాదం.. వ్యక్తి మృతి!

Fire accident at ranbir kapoor movie shooting spot: రణబీర్ కపూర్ హీరోగా, శ్రద్దా కపూర్ నటిస్తున్న ఒక సినిమా సెట్ లో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. లవ్ రంజన్ దర్శకత్వం వహిస్తున్న ఇంకా పేరు ఖరారు చేయని సినిమా కోసం సెట్స్ సిద్ధం చేస్తున్నారు. ముంబయిలోని అంధేరి వెస్ట్ ప్రాంతంలోని చిత్రకూట్ స్టూడియోలో ఈ సినిమా కోసం సెట్స్‌ సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో అక్కడ అగ్ని ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు.

స్టూడియోలో ప్లాస్టిక్, థర్మాకోల్‌తో కూడిన సెట్‌ ఉండడంతో మంటలను ఆర్పడం కష్టంగా మారిందని, సుమారు 12కి పైగా అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పడానికి తీవ్రంగా శ్రమించడంతో ఎట్టకేలకు అవి అదుపులోకి వచ్చాయని తెలుస్తోంది. .. సెట్స్‌లో ప్రీ లైటింగ్ వర్క్ జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. లవ్ రంజన్ తన సినిమాలోని ఒక పాటను ఇక్కడ చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.

అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు తొలుత బయటకు రాలేదు కానీ మంటలు అదుపులోకి తీసుకువచ్చాక మనీశ్ దేవాసీ అనే 32 ఏళ్ల సెట్ బాయ్ మరణించారని గుర్తించారు. ఇక ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అగ్నిమాపక దళ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఇది లెవల్ 2 అగ్నిప్రమాదం అని సమాచారం.

అగ్నిప్రమాదం జరిగిన లవ్ రంజన్ సెట్ పక్కనే రాజశ్రీ ప్రొడక్షన్స్‌కు చెందిన మరో రెండు సెట్లు ఉన్నాయి. సన్నీ డియోల్ కుమారుడు, నటుడు రాజ్‌వీర్ డియోల్ ఆ సమయంలో అదే సెట్లో షూటింగ్‌లో ఉన్నాడని అంటున్నారు. మంటలు వారి సెట్‌లకు కూడా చేరుకునేంత తీవ్రంగా ఉండడంతో షూటింగ్‌ను అప్పటికప్పుడు నిలిపివేసి వారందరినీ ఖాళీ చేయించారు. అయితే సెట్ నిర్మాణంలోనే ప్రమాదం జరగడంతో హీరోహీరోయిన్లకు ఎలాంటి ఇబ్బంది లేదనే చెప్పాలి. 

Also Read: Ramarao on duty: పవిత్ర లోకేష్ కనిపించగానే థియేటర్లలో గోలగోల.. మాములు రచ్చ కాదుగా!

Also Read: Bipasha Basu Pregnent: తల్లి కాబోతున్న బాలీవుడ్ భామ.. అందుకే దూరంగా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook

Trending News