అల్లు అర్జున్‌తో 'గీత గోవిందం' దర్శకుడి సినిమా

స్టైలిష్ స్టార్‌తో గీత గోవిందం దర్శకుడి సినిమా 

Last Updated : Aug 10, 2018, 01:27 PM IST
అల్లు అర్జున్‌తో 'గీత గోవిందం' దర్శకుడి సినిమా

శ్రీరస్తు శుభమస్తు సినిమా తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకుని గీత గోవిందం సినిమాతో ఆడియెన్స్ ముందుకొస్తున్న దర్శకుడు పరశురామ్ త్వరలోనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో ఓ సినిమా చేయనున్నట్టు తెలిపాడు. విజయ్ దేవరకొండ హీరోగా వస్తోన్న గీత గోవిందం సినిమా ఈ ఆగస్టు 15న రిలీజ్ కానున్న నేపథ్యంలో ఆ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన పరశురామ్ ఆ ఇంటర్వ్యూలో తానే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పరుగు సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన పరశురామ్ అప్పటినుంచే బన్నీతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటూ వస్తున్నాడట. ఎప్పటికప్పుడు తన ఐడియాలను బన్నీతో పంచుకుంటుంటానని, వాటికి ఆయన నుంచి మంచి ప్రోత్సాహం కూడా లభిస్తుంటుందని చెప్పిన పరశురామ్.. భవిష్యత్‌లో బన్నీతో తప్పకుండా ఓ సినిమా ఉంటుందని, కాకపోతే అందుకు తగిన స్క్రిప్ట్ ఇంకా రెడీ కాలేదని పరశురామ్ స్పష్టంచేశాడు.

గీత గోవిందం సినిమాను నిర్మించిన గీతా ఆర్ట్స్ బ్యానర్‌పైనే తన తర్వాతి సినిమా కూడా ఉంటుందని, కాకపోతే అది అల్లు అర్జున్ సినిమా కాదని క్లారిటీ ఇచ్చాడు పరశురామ్. అంతేకాకుండా మైత్రి మూవీ మేకర్స్‌తోనూ మరో సినిమా ఉంటుందని పరశురామ్ చెప్పుకొచ్చాడు. ఏదేమైతేనేం.. శ్రీరస్తు శుభమస్తు సినిమాతో బాగా డీలా పడిన పరశురామ్‌కి గీత గోవిందం సినిమా విడుదలకు ముందే కాసిన్ని శుభాలను తీసుకొస్తున్నట్టుందన్న మాట.

Trending News