గోపీచంద్ "పంతం" రిలీజ్ డేట్ ఫిక్స్

"తొలివలపు" చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన నటుడు గోపీచంద్‌. తొలుత జయం, నిజం, వర్షం లాంటి సినిమాల్లో విలన్ వేషాలు చేసి.. ఆ తర్వాత హీరోగా తనకుంటూ ఒక ఇమేజ్ తెచ్చుకున్నాడు.

Updated: Feb 9, 2018, 12:20 PM IST
గోపీచంద్ "పంతం" రిలీజ్ డేట్ ఫిక్స్

"తొలివలపు" చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన నటుడు గోపీచంద్‌. తొలుత జయం, నిజం, వర్షం లాంటి సినిమాల్లో విలన్ వేషాలు చేసి.. ఆ తర్వాత హీరోగా తనకుంటూ ఒక ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఆయన హీరోగా తెరకెక్కుతున్న సినిమాకి ‘పంతం’ అని పేరు పెట్టిన్నట్లు తెలుస్తోంది.పవర్‌, జై లవకుశ సినిమాలకు డైలాగ్ రైటర్‌గా పనిచేసిన కె. చక్రవర్తి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. 

ఈ చిత్రాన్ని మే 18న విడుదల చేసే అవకాశం ఉందని ఇటీవలే తెలిపారు నిర్మాతలు‌. ఇప్పటికే పలు పాటలతో పాటు చిత్రంలోని కొన్ని సన్నివేశాలను చిత్రీకరించిన సినిమా యూనిట్ పలు  యాక్షన్ సన్నివేశాలను హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరిస్తోంది. ఈ చిత్రం గోపీచంద్ కెరీర్‌లో 25వ చిత్రం కావడం గమనార్హం. గోపీచంద్‌ సరసన మెహరీన్‌ కౌర్‌ కథా నాయికగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు.