Indian 3: నేరుగా ఓటీటీ లోకి రానున్న కమల్ హాసన్ ఇండియన్ 3.. అదే కారణమా..?

Indian 3 OTT: కోలీవుడ్ స్టార్ హీరో కమలహాసన్ ఇండియన్ 2 సినిమాతో బాక్సాఫీస్ వద్దకు వచ్చి ఘోర పరాభవాన్ని చవిచూశారు.  ఈ నేపథ్యంలోనే ఇండియన్ 3 మూవీ ను తెరకెక్కించే పనిలో పడ్డారు.  థియేటర్లలో విడుదల చేయాలా?  లేక నేరుగా ఓటీటీలోకి తీసుకురావాలా అనే సందిగ్ధంలో పడినట్లు సమాచారం. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Oct 3, 2024, 04:24 PM IST
Indian 3: నేరుగా ఓటీటీ లోకి రానున్న కమల్ హాసన్ ఇండియన్ 3.. అదే కారణమా..?

Indian 3 Release Date: కోలీవుడ్ స్టార్ హీరో కమలహాసన్ వరుస చిత్రాలు చేస్తూ అటు టాలీవుడ్ ఇటు కోలీవుడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. అంతేకాదు ఈమధ్య ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటు తూ రికార్డ్ సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ప్రభాస్ కల్కి2898AD సినిమాలో యాస్కిన్ పాత్రలో నటించి అందరిని అబ్బురపరిచారు. అంతేకాదు కల్కి 2898AD సీక్వెల్ లో కూడా మరోసారి తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో ఆకట్టుకోబోతున్నట్లు సమాచారం. 

ఇదిలా ఉండగా 1994లో విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీ భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా భారతీయుడు 2 విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఆశించినంత స్థాయిలో సక్సెస్ కాలేదు. దీంతో భారతీయుడు 3 తెరకెక్కించారు అనే వార్తలు వినిపిస్తున్నా మరొకవైపు సినిమాను థియేటర్లలో కాకుండా ఓటీటీ లో నేరుగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 

అసలు విషయంలోకి వెళితే.. 2024 జూన్ 12వ తేదీన థియేటర్లలోకి వచ్చిన ఇండియన్ 2 సినిమా ఒక మోస్తారు విజయాన్ని అందుకుంది. ప్రధానంగా ఎటువంటి స్ఫూర్తి లేని కథాంశం కారణంగానే ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచిందని సమాచారం. 

ముఖ్యంగా సినిమా నిర్మాణం కూడా ఎన్నో అడ్డంకులతో సాగింది. దీనికి తోడు సినిమా సెట్ లో దర్శకుడికి , హీరోకి మధ్య విభేదాలు వల్ల  సినిమా విడుదల ఆలస్యానికి దారితీసింది.. చివరికి ఈ సినిమా విడుదలైనా బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం ప్రదర్శన కనబరచలేకపోయింది. 

ఇందులో ఆకట్టుకునే తారాగణం ఉన్నప్పటికీ కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. అంతేకాదు 2024 ఏడాదిలో అతిపెద్ద ఫ్లాపులలో ఒకటిగా ఈ చిత్రం నిలవడం కమల్ హాసన్ అభిమానులకు మింగుడు పడడం లేదు. ముఖ్యంగా ఈ సినిమా విజయం సాధించడం కోసం లైకా ప్రొడక్షన్స్ వారు చేయాల్సినదంతా చేశారు కానీ ఫలితం మాత్రం శూన్యం.  

అందుకే భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తూ ప్రసిద్ధి చెందిన లైకా ప్రొడక్షన్స్ ప్రస్తుతం క్లిష్ట దశను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇండియన్ 3 ని నేరుగా థియేటర్లలో కాకుండా ఓటిటిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికైతే అటు లైకా ప్రొడక్షన్స్ ఇటు కమల్ హాసన్ తీసుకున్న నిర్ణయానికి అభిమానులు కాస్త నిరాశ చెందుతున్నారని చెప్పవచ్చు.

Also Read: Nani: కొండా సురేఖ వ్యాఖ్యల దుమారం.. ఖండఖండాలుగా ఖండించిన హీరో నాని

Also Read: Naga Chaitanya: మీ మాటలు బాధను కలిగించాయి.. చాలా సిగ్గునీయం: కొండా సురేఖపై నాగ చైతన్య ఫైర్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News