Hero Kamal Kamaraj : సోదర సోదరీమణులారా అంటూ హీరోగా రాబోతోన్న కమల్ కామరాజ్

Sodara Sodarimanulara Special Poster రిపబ్లిక్ డే సందర్భంగా సోదర సోదరిమణులారా స్పెషల్‌ పోస్టర్‌ను మేకర్లు విడుదల చేశారు. ఇందులో నటుడైన కమల్ కామరాజ్ హీరోగా పరిచయం కాబోతోన్నాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 26, 2023, 02:35 PM IST
  • రిపబ్లిక్ డే స్పెషల్ పోస్టర్
  • సోదర సోదరిమణులారా అప్డేట్
  • హీరోగా కమల్ కామరాజ్
Hero Kamal Kamaraj : సోదర సోదరీమణులారా అంటూ హీరోగా రాబోతోన్న కమల్ కామరాజ్

Sodara Sodarimanulara Special Poster ప్రస్తుతం తెలుగు చిత్ర సీమలో కొత్త కథలు వస్తూ ఉన్నాయి. మేకర్లు సైతం తమ శైలికి భిన్నంగా ఉన్న సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఫ్యామిలీ, మాస్, క్లాస్ ఇలా అన్ని రకాల చిత్రాలు బాక్సాఫీస్ మీద విజయాన్ని సాధిస్తున్నాయి. కొత్త కథతో వస్తే మాత్రం జనాలు ఇట్టే విజయాన్ని కట్టబెట్టేస్తున్నారు.

ఇప్పుడు ఓ నూతన దర్శకుడు రఘుపతి రెడ్డి వినూత్న కథతో 'సోదర సోదరీమణులారా...' అంటూ రాబోతోన్నాడు. ఇందులో కమల్ కామరాజు, అపర్ణాదేవి ప్రధాన పాత్రలు పోషించారు. 9ఈఎం ఎంటర్టైన్మెంట్స్, ఐఆర్ మూవీస్ బ్యానర్లపై సంయుక్తంగా రాబోతోన్న ఈ చిత్రాన్ని విజయ్ కుమార్ పైండ్ల  నిర్మించారు. ఆకట్టుకునే టైటిల్ తో  రూపొందిన ఈ చిత్రం ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకుంది.  పక్కా స్క్రిప్ట్ తో పెర్ఫెక్ట్ ప్లానింగ్ తో 35 రోజుల్లో తెరకెక్కిన ఈ సినిమా హార్ట్ టచింగ్ ఫ్యామిలీ డ్రామా గా ప్రేక్షకులను అలరించనుంది. రిపబ్లిక్ డే స్పెషల్‌గా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ ను  చిత్ర బృందం  విడుదల చేసింది. 

సిస్టర్స్ అండ్ బ్రదర్స్ టాగ్ లైన్ తో కమల్ కామరాజు, అపర్ణాదేవి ఎమోషనల్ లుక్‌తో ఉన్న పోస్టర్ ఈ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. టైటిల్ పోస్టర్‌తోనే అందరూ అన్వయించుకొనే పాత్రలతో రియాలిస్టిక్ డ్రామా గా ఈ సినిమా ఉండనున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వేసవి కానుకగా రాబోతోంది. కథానుసారంగా మూడు పాటలను మదీన్ ఎస్. కె అద్భుతంగా ట్యూన్ చేశారు. మోహన్ చారి కెమెరామెన్ గా, వంశీ కృష్ణ సి.హెచ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Also Read:  Hunt Telugu Movie Review : హంట్ రివ్యూ.. సుధీర్ బాబు డేరింగ్ స్టెప్ 

Also Read: Sharwanand Engagement: ఘనంగా హీరో శర్వానంద్‌ ఎంగేజ్‌మెంట్‌.. వైరల్ పిక్స్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News