మరో మూడు రోజుల్లో మన ముందుకు రాబోతున్న కాంచన

లారెన్స్ మూవీ కాంచన -3 రిలీజ్ కు సంబంధించిన కౌంట్ డౌన్ మొదలైంది

Last Updated : Apr 16, 2019, 08:29 PM IST
మరో మూడు రోజుల్లో మన ముందుకు రాబోతున్న కాంచన

లారెన్స్  డైరక్షన్ లో తెరపైకి వస్తున్న కాంచన-3 మూవీకి కౌంట్ డౌన్ మొదలైంది. సరిగ్గా మరో మూడు రోజుల్లో ఈ మూవీ వెండితెరపై కనిపించనుంది థియేటర్లలో సరికొత్త ఎక్స్ పీరియన్స్ అందించడానికి సిద్ధమైంది కాంచన-3. 

ఒకేసారి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదలవుతోంది ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1500 థియేటర్లలో ఈ సినిమా విడుదలకాబోతోంది. ఓవైపు హిందీలో అక్షయ్ కుమార్ తో కాంచన సినిమా రీమేక్ చేయబోతున్నాడు లారెన్స్. మరోవైపు కాంచన-3 డబ్బింగ్ వెర్షన్ బాలీవుడ్ కూడా విడుదలవుతోంది.కాంచన-3. 

లారెన్స్ తనే నటించి, నిర్మించి, దర్శకత్వం వహించిన ఈ సినిమాను హిందీలో రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్స్, తమిళ్ లో సన్ పిక్చర్స్, తెలుగులో ఠాగూర్ మధు విడుదల చేస్తున్నారు.

ఈ మూవీపై లారెన్స్ స్పందిస్తూ తన కెరీర్ లోనే ఇది ది బెస్ట్ మూవీ అవుతుందంటున్నాడు. కాంచన-3 కేవలం హారర్ సినిమా మాత్రమే కాదని..ఇందులో చాలా విషయాలు దాగి ఉన్నాయని లారెన్స్ పెర్కొంటున్నాడు. వేదిక, ఒవియా, నిక్కీ హీరోయిన్లు గా నటించిన ఈ సినిమాలో పాటలు బ్రహ్మా్ండంగా ఉంటాయంటున్నాడు. పాటలతో పాటు మంచి కామెడీ, డ్రామా కూడా ఉంటుందంటున్నాడు లారెన్స్.

Trending News