Animal Pre-release event:: రష్మికకి స్వీట్ హగ్ ఇచ్చేసిన మహేష్ బాబు‌... వైరల్ అవుతున్న వీడియో

Mahesh Babu: యానిమల్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో రష్మిక పచ్చ రంగు చీరలో అటెండ్ అయ్యి అందరినీ ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో ఈ హీరోయిన్ మహేష్ బాబు గురించి చేసిన వ్యాఖ్యలు.. ఆ తరువాత మహేష్ బాబు రష్మిక కి ఇచ్చిన హాగ్ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది.  

Last Updated : Nov 28, 2023, 11:00 AM IST
Animal Pre-release event:: రష్మికకి స్వీట్ హగ్ ఇచ్చేసిన మహేష్ బాబు‌... వైరల్ అవుతున్న వీడియో

 Rashmika Mandanna: హైదరాబాద్ లో నిన్న సాయంత్రం యానిమల్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రంగ రంగ వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్ కి యానిమల్ సినిమా యూనిట్ తో పాటు.. చీఫ్ గెస్ట్లుగా మహేష్ బాబు.. రాజమౌళి హాజరయ్యారు. అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ మరోసారి తనదైన స్టైల్ తో తీస్తున్న సినిమా యానిమల్. డిసెంబర్ 1న ఈ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ జోరు కొనసాగిస్తున్నారు సినిమా యూనిట్. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా.. ఆ ఈవెంట్లో సంబరాలు అంబరాన్ని అంటాయి.

కాగా ముఖ్యంగా ఈ ఈవెంట్లో చీరలో ముస్తాబయి అందరిని తెగ ఆకట్టుకుంది హీరోయిన్ రష్మిక మందన. పుష్పా సినిమా తరువాత రష్మిక కి తెలుగులోనే కాదు హిందీలో కూడా అభిమానులు ఏర్పడ్డారు. ఇక ఇప్పుడు ఈ యానిమల్ సినిమాతో మరో పాన్ ఇండియా చిత్రం చేసేసి.. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులకు మరింత దగ్గర కాబోతోంది ఈ హీరోయిన్. ఇక రష్మిక యానిమల్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన మాటలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.


 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_)

ముందుగా అందరికీ ధన్యవాదాలు తెలిపిన రష్మిక రాజమౌళి గురించి మాట్లాడుతూ.. తాను రాజమౌళి సార్ ని మొదట పుష్ప ఈవెంట్ లో కలిశానని ఆ తరువాత ఈ ఈవెంట్ లో కలుస్తున్నానని.. వారిద్దరి మధ్య ఏదో బ్లాక్ బస్టర్ కనెక్షన్ ఉంది అని ముసి ముసి నవ్వులు నవ్వుతూ చెప్పేసింది.

ఆ తరువాత సుమ మహేష్ బాబు గురించి చెప్పమనగా.. రష్మిక మహేష్ బాబు తాను నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఫేమస్ డైలాగ్ చెబుతూ మహేష్ బాబు ని వర్ణించింది. హి ఇస్ సో క్యూట్.. సో స్వీట్సస సో హ్యాండ్సమ్ అని రష్మిక ముచ్చటగా చెబుతూ ఉండగా.. మహేష్ బాబు రష్మిక దగ్గరకు వచ్చి తనకి ఒక స్వీట్ హాగ్ ఇచ్చేశారు. కాగా మహేష్ బాబు రష్మికని కౌగిలించుకున్న విధానం తనకు ఆశీర్వాదం ఇస్తున్నట్టు ముచ్చటగా కనిపివ్వడంతో అక్కడున్న వారందరూ ఈ సీన్ చూసి తెగ మురిసిపోయారు. ఇక ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది.

Also Read: IPL 2024 Purse Details: ముగిసిన రిటెన్షన్ ప్రక్రియ, ఏ జట్టు పర్సులో ఎంత ఉందో తెలుసా.

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

  

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x