Gautham Ghattammaneni: యూఎస్ వీధుల్లో అనుకోకుండా యూట్యూబర్ కి దొరికిన మహేష్ బాబు కొడుకు.. వీడియో వైరల్..!

Mahesh Babu Son Viral Video:  తాజాగా విదేశీ వీధుల్లో తిరుగుతున్న గౌతమ్ ఘట్టమనేని ఒక టిక్ టాకర్ దృష్టిలోకి రావడంతో… అక్కడ ఆయన టాలెంట్ చూసి అందరూ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఎందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటుంది..

Written by - Vishnupriya | Last Updated : Nov 2, 2024, 09:18 AM IST
Gautham Ghattammaneni: యూఎస్ వీధుల్లో అనుకోకుండా యూట్యూబర్ కి దొరికిన మహేష్ బాబు కొడుకు.. వీడియో వైరల్..!

Gautham viral video: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఘట్టమనేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అతి తక్కువ సమయంలోనే ప్రిన్స్ హీరోగా మారి ఇప్పుడు సూపర్ స్టార్ గా చలామణి అవుతున్న మహేష్ బాబు గురించి..పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.  తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈయన సేవా కార్యక్రమాలతో పాటు ప్రజల మన్ననలు చూరగొన్నాడు. 

Add Zee News as a Preferred Source

అంతేకాదు ఎంతోమంది గుండెలకు శస్త్ర చికిత్సలు చేయించి వారికి ప్రాణదానం చేశారు. ఇక ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో..ఎస్ ఎస్ ఎం బి 29 అనే వర్కింగ్ టైటిల్ తో యాక్షన్ అడ్వెంచర్ మూవీని చేయబోతున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం ఈ సినిమా పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతోంది. 

ఇదిలా ఉండగా ఈ మధ్యకాలంలో టిక్ టాకర్ లు ఎక్కువగా పబ్లిక్ తో మమేకం అవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తాము అడిగిన ప్రశ్నలకు వారు సమాధానాలు చెబితే ప్రైజ్ మనీ కూడా గెలుచుకునే అవకాశం ఉంటుందని తెలియజేశారు.

ఇదిలా ఉండగా మరొకవైపు మన ఇండియాలో సెలబ్రిటీలు కూడా విదేశాలలో సాదాసీదాగా తిరుగుతారని, ఈ క్రమంలోని ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన మహేష్ బాబు కొడుకు గౌతమ్ ఘట్టమనేని కూడా అక్కడ తన స్నేహితులతో కలిసి యుఎస్ వీధుల్లో తిరిగారు. దీంతో ఒక టిక్ టాకర్ మహేష్ బాబు కొడుకు ఘట్టమనేని గౌతమ్ , ఆయన సన్నిహితులకు కొన్ని ప్రశ్నలు వేశారు.. ఆ ప్రశ్నలకు సమాధానాలు చెబితే వంద డాలర్లు ఇస్తానని ఆఫర్ ఇచ్చారు. అందులో భాగంగానే బాలీవుడ్ సంగీతానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు అడగగా.. గౌతమ్ వారి స్నేహితులు సమాధానాలు చెప్పి ఆ ప్రైజ్ మనీ గెలుపొందారు. 

ఆ తర్వాత ఆ టిక్ టాకర్ తో గౌతం "  ఐ కెన్ జస్ట్ వైబ్ టు ఇట్ , ఏదైనా చెప్పగలను" అంటూ బాలీవుడ్ సంగీతం గురించి సమాధానం చెప్పారు.  ఇక ఈ విషయం చూసి మహేష్ బాబు అభిమానులు తమ అభిమాన హీరో కొడుకు టాలెంట్ చూసి ఫిదా అవుతున్నారు. అంతేకాదు ఈ వీడియో పై మహేష్ బాబు కుమార్తె సితార కూడా.." నా సోదరుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు" అని పోస్ట్ చేయగా.. గౌతమ్.."నేనేం చేయలేదు" అంటూ రిప్లై కూడా ఇచ్చాడు. ఇది చూసిన తెలుగు ఆడియన్స్ టిక్ టాకర్ కి గౌతమ్ మహేష్ బాబు కొడుకని కలిసి ఉంటే తెలుగు మ్యూజిక్ గురించి అడిగే వారేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు.

 

 
 
 
 
 

 

 

ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..

 

ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News