'సమ్మోహనం' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్‌గా మహేష్ బాబు

సమ్మోహనం సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్‌కి సూపర్ స్టార్ మహేష్ బాబు

Last Updated : Jun 7, 2018, 05:52 PM IST
'సమ్మోహనం' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్‌గా మహేష్ బాబు

సమ్మోహనం సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్‌కి సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా రానున్నారు. మహేష్ బాబు బావ సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 14న ఆడియెన్స్ ముందుకు రానుండగా అంతకన్నా ముందుగా జూన్ 10న ప్రీ-రిలీజ్ వేడుక జరుపుకునేందుకు చిత్రనిర్మాతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. చిత్ర నిర్మాతల కోరిక మేరకు హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరగనున్న సమ్మోహనం ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌కి హాజరయ్యేందుకు మహేష్ బాబు అంగీకరించారు. ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీలో సుధీర్ బాబు సరసన అదిథి రావు హైదరి జంటగా నటించింది. 

ఇటీవలే రిలీజైన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ సైతం సుధీర్ బాబు అభిమానులను ఆకట్టుకుంటోంది. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు వివేక్ సాగర్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. 

 

Trending News