మహేష్ బాబు ఫ్యాన్స్‌ని అలరిస్తున్న మహర్షి టీజర్

మహర్షి టీజర్‌లో మహేష్ బాబు 

Last Updated : Aug 9, 2018, 06:22 PM IST
మహేష్ బాబు ఫ్యాన్స్‌ని అలరిస్తున్న మహర్షి టీజర్

తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు అప్‌కమింగ్ సినిమా మహర్షి టీజర్‌కి అభిమానుల నుంచి భారీ స్పందన కనిపిస్తోంది. ఆగస్టు 9న అభిమానులకు సూపర్ స్టార్ బర్త్ డే కానుకగా రిలీజైన ఈ టీజర్ ఆడియెన్స్‌ని అలరిస్తోంది. మున్నా, బృందావనం, ఎవడు, ఊపిరి వంటి సినిమాలను తెరకెక్కించిన వంశీ పైడిపల్లి ఈ సినిమాలో మహేష్ బాబును ఓ విభిన్నమైన పాత్రలో ప్రజెంట్ చేస్తున్నట్టు ఈ టీజర్ చూస్తే అర్థమవుతోంది. చేతిలో ల్యాప్‌టాప్, గడ్డం లుక్‌తో కాలేజ్ కుర్రోడిగా అమ్మాయిలను దాటుకుంటూ నడిచొస్తున్న మహేష్ బాబును చూస్తే, మహర్షి సినిమాలో సూపర్ స్టార్‌లో మరో కొత్త కోణాన్ని చూడటం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రిలీజైన కొన్ని గంటల్లోనే 1మిలియన్ వ్యూస్ పూర్తి చేసుకుని రెండు మిలియన్స్ వ్యూస్ వైపు పరుగులుతీస్తోన్న మహర్షి టీజర్‌పై మీరూ ఓ లుక్కేయండి.

 

దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు ఓ ఫార్చూన్ 500 కంపెనీకి సీఈఓ పాత్ర పోషిస్తున్నాడు. 

Trending News