VD12: విజయ్ దేవరకొండ సినిమాలో నందమూరి హీరోలు.. బాబాయ్ లేదా అబ్బాయి..!

VD12 Teaser: విజయ్ దేవరకొండ హీరోగా గౌతం తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న VD12 సినిమా టీజర్ కోసం.. ఒక స్టార్ హీరోతో వాయిస్ ఓవర్ ఇప్పించాలని చిత్ర బృందం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దీనికోసం నందమూరి హీరోల్లో ఎవరైనా అయితే బాగుంటుంది అని.. మరి నీ సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. అసలే ఫ్లాప్స్ లో ఉన్న విజయ్ దేవరకొండ సినిమాకి నందమూరి హీరోల ఎంట్రీ.. బాగానే వర్క్ అవుట్ అయ్యేలా కనిపిస్తోంది.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Aug 24, 2024, 03:06 PM IST
VD12: విజయ్ దేవరకొండ సినిమాలో నందమూరి హీరోలు.. బాబాయ్ లేదా అబ్బాయి..!

VD12 Update: ఈమధ్య వరుస ఫ్లాప్ .. సతమతమవుతున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ తన ఆశలన్నీ తన నెక్స్ట్ సినిమా పైన పెట్టుకున్నారు. VD12 అనే వర్కింగ్ టైటిల్ .. త్వరలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న ఈ సినిమాకి గౌతం తిననూరి దర్శకత్వం వహించారు. 

ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ .. అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. త్వరలోనే చిత్ర బృందం ఈ సినిమా టీజర్ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇందులో ప్రత్యేకత ఏముంది అంటే.. చిత్ర టీజర్ కి వాయిస్ ఓవర్ ఇవ్వడం కోసం నందమూరి బాలకృష్ణ లేదా ఎన్టీఆర్ రంగంలోకి దింపాలి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. 

గౌతమ్ తిన్ననూరి .. వస్తున్న సినిమా కాబట్టి మంచి అంచనాలు ఉన్నాయి కానీ.. విజయ్ దేవరకొండ ట్రాక్ రికార్డు కారణంగా కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. కానీ బాలకృష్ణ .. ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు ఈ సినిమాకి వాయిస్ ఓవర్ ఇస్తే అది ప్రమోషన్స్ పరంగా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. 

ఈ సినిమాపై ఆల్రెడీ ఉన్న బజ్ కంటే ఎన్టీఆర్ లేదా బాలయ్య వంటి వారు ఇచ్చే వాయిస్ ఓవర్ బాగా బూస్ట్ ఇస్తుంది. అసలే ఫ్లాప్ లలో ఉన్న విజయ్ దేవరకొండ కి బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారు. మరి ఈ ఇద్దరు నందమూరి హీరోలలో ఎవర్ని రంగంలోకి దింపుతారో వేచి చూడాలి.

శ్రీ లీల ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. సాయి సౌజన్య, నాగ వంశీ ఈ సినిమాను సితార ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. అనిరుద్ రవిచంద్ర ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Also Read: YS Jagan: తొలిసారి జగన్‌ విశాఖ పర్యటన.. సీఎంగా ప్రమాణం చేస్తానన్న చోట అధికారం కోల్పోయి

Also Read: Tirumala Water Problem: తిరుమలలో నీటి సంక్షోభం.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News