సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో బాస్‌లు ఇంత దారుణంగా భయపెడతారా ?

నన్ను దోచుకుందువటె ట్రైలర్ 

Last Updated : Sep 10, 2018, 06:07 PM IST
సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో బాస్‌లు ఇంత దారుణంగా భయపెడతారా ?

సుధీర్ బాబు నటిస్తున్న కొత్త సినిమా నన్ను దోచుకుందువటే ట్రైలర్ రిలీజైంది. ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బిగ్‌బాస్ హౌజ్ ఆంథెమ్ వీడియో సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా ఓ సాంగ్ వీడియో విడుదలైన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ ఆంథెమ్ వీడియో సాంగ్ చూస్తే, ఈ సినిమలో సుధీర్ బాబు పాత్ర తీరుతెన్నులేంటో ఓ అంచనాకు రావచ్చని అర్థమైంది. ఇదిలాఉండగా తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే, సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో బాస్‌లు మరీ ఇంత కఠినంగా వ్యవహరిస్తే, ఇక ఆ సంస్థలో పనిచేసే సిబ్బంది పరిస్థితేంటనే సందేహం రాకమానదు. దర్శకుడు ఆర్.ఎస్. నాయుడు డైరెక్ట్ చేసిన ఈ సినిమాను సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుధీర్ బాబు స్వయంగా నిర్మించాడు. సుధీర్ బాబు సరసన నభా నతేష్ జంటగా నటించగా బి అజనీశ్ లోక్‌నాథ్ మ్యూజిక్ కంపోజ్ చేశారు.

Trending News