Netflix Free Plan: నెట్‌ఫ్లిక్స్ ఫ్రీ స్ట్రీమింగ్ ప్లాన్ ప్రారంభించనుందా

Netflix Free Plan: ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఓటీటీల్లో ప్రముఖమైంది, అత్యధిక ఆదరణ కలిగింది నెట్‌ఫ్లిక్స్. త్వరలో నెట్‌ఫ్లిక్స్ ఉచితంగా అందనుందంటే ఆశ్చర్యపోతున్నారా..కానీ నిజమే ఇది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 25, 2024, 05:52 PM IST
Netflix Free Plan: నెట్‌ఫ్లిక్స్ ఫ్రీ స్ట్రీమింగ్ ప్లాన్ ప్రారంభించనుందా

Netflix Free Plan: అమెజాన్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, సోనీలివ్, ఆహా, జీ5, నెట్‌ఫ్లిక్స్ ఇంకా చాలా ఓటీటీలున్నాయి. కానీ అన్నింటిలో డిమాండ్ కలిగింది నెట్‌‌ఫ్లిక్స్ మాత్రమే. నెట్‌ఫ్లిక్స్ షేరింగ్ కూడా సాధ్యం కాకపోవడంతో తప్పనిసరిగా సబ్‌స్క్రైబ్ కావల్సిందే. అలాంటి నెట్‌ఫ్లిక్స్ ఫ్రీ స్ట్రీమింగ్ అంటే నమ్మలేకున్నారు కదూ..

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ త్వరలో ఫ్రీ స్ట్రీమింగ్ ప్లాన్ ప్రవేశపెట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి. అంటే యూజర్లు ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ లేకుండానే ఉచితంగా వీక్షించవచ్చు. కేవలం ప్రకటనల ద్వారా ఆదాయం పెంచుకునే అవకాశాలు పరిశీలిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఎంపిక చేసిన మార్కెట్‌లలో ఈ ఫ్రీ స్ట్రీమింగ్ అందించవచ్చని తెలుస్తోంది. అయితే ఆసియా, యూరప్ మార్కెట్‌లలో ఈ ఫ్రీ ప్లాన్ ప్రవేశపెట్టవచ్చని అంచనా. ఈ ప్లాన్‌లో ప్రకటనలతో కూడిన స్ట్రీమింగ్ ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్‌కు ఉన్న ఆదరణ దృష్ట్యా ఫ్రీగా అందిస్తే ఎక్కువమంది వీక్షిస్తారని తద్వారా యాడ్ రెవెన్యూ పెంచుకోవచ్చనేది కంపెనీ ఆలోచనగా ఉంది. 2021లో కెన్యాలో ఆండ్రాయిడ్ ఫోన్లలో నెట్‌ఫ్లిక్స్ ఈ తరహా ప్రయోగం చేసింది. గత ఏడాది ఈ ప్లాన్ నిలిపివేసింది. యూఎస్‌లో మాత్రం ఫ్రీ స్ట్రీమింగ్ ప్లాన్ ప్రవేశపెట్టే ఆలోచన నెట్‌ఫ్లిక్స్‌కు లేదని తెలుస్తోంది. యూఎస్‌లో నెట్‌ఫ్లిక్స్ నెలకు 600 రూపాయల ప్లాన్ బాగా సక్సెస్ అయింది. ఎక్కువమంది ఈ ప్లాన్ వినియోగిస్తున్నారు. 

ఫ్రీ స్ట్రీమింగ్ ప్లాన్ ప్రవేశపెడితే వీక్షకుల సంఖ్య పెరగవచ్చు. తద్వారా యాడ్ రెవిన్యూ పెరుగుతుంది. అంటే వీక్షకులు ఎంత ఎక్కువమంది ఉంటే యాడ్స్ అంత ఎక్కువగా వస్తాయి. దాంతో రెవిన్యూ సహజంగానే పెరుగుతుంది. అందుకే నెట్‌ఫ్లిక్స్ కొన్ని ఎంపిక చేసిన మార్కెట్‌లలో ఈ ఉచిత స్ట్రీమింగ్ ప్లాన్ అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. వచ్చే ఏడాది చివరికి ఈ ఫ్రీ స్ట్రీమింగ్ ప్లాన్‌ను నెట్‌ఫ్లిక్స్ అందుబాటులో తీసుకురావచ్చు.

Also read: NEET 2024 Scam: నీట్ అవకతవకలు, పేపర్ లీక్ వ్యవహారంపై ఈడీ, త్వరలో ఎఫ్ఐఆర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News