NTR fans : ఇంకా లేట్ అవనున్న కొరటాల సినిమా.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ హ్యాపీ!

NTR fans Happy: సాధారణంగా తమ హీరో సినిమా లేటయితే అభిమానులు బాధ పడుతూ ఉంటారు కానీ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం సినిమా లేట్ అవుతున్నందుకు ఆనందం వ్యక్తం చేసున్నారు. ఆ వివరాలు 

Last Updated : Nov 20, 2022, 08:44 AM IST
NTR fans : ఇంకా లేట్ అవనున్న కొరటాల సినిమా.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ హ్యాపీ!

NTR fans Happy with Koratala Movie Shooting Late: జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ఇంకా బాలరిష్టాలు ఎదుర్కొంటూనే ఉంది. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉంది. జూన్ నెలకి జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్,తదనంతర వెకేషన్స్  అన్ని పూర్తి చేసుకొని ఖాళీ అయిపోయారు ఆ నెల నుంచే షూటింగ్ మొదలవుతుంది అనుకున్నారు కానీ కొరటాల శివ స్క్రిప్ట్ ని జూనియర్ ఎన్టీఆర్ పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు చేయమని సూచించడంతో ఆ నిమిత్తం షూట్ ఆగింది.

ఆ తర్వాత అసలు కథే నచ్చలేదని సినిమా ఆగిపోతుంది అని కూడా జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ సినిమా యూనిట్ అయితే ఒక ఖండన ప్రకటించడమే కాక ఒక అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసి కొరటాల శివ, రత్నవేలు, సబు సిరిల్ కలిసి చర్చిస్తున్నట్లు ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. ఇక ఇంతలా హడావిడి చేశారు కాబట్టి ఈ షూటింగ్ డిసెంబర్లో లేదా జనవరిలో మొదలయ్యే అవకాశం ఉందని అనుకున్నారు కానీ అప్పటికి కూడా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం లేదని తెలుస్తోంది.

సినీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సినిమా ఫిబ్రవరి నుంచి సెట్స్ మీదకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. అయితే ఎందుకు ఇలా వాయిదా వేస్తున్నారు అనే విషయం మీద మాత్రం క్లారిటీ లభించడం లేదు ప్. స్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం అయితే మరో మూడు నెలల పాటు పోస్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులు చేయాలని ఆ తర్వాతే సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఈ సినిమా ఇంత ఆలస్యం కావడానికి జూనియర్ ఎన్టీఆర్ తీసుకున్న ప్రత్యేక శ్రద్దే కారణమని  తెలుస్తోంది.

దీంతో ఒకపక్క షూటింగ్ వాయిదా పడుతున్నా ఫ్యాన్స్ అయితే కొంతమేర ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎలా పడితే అలా ముందుకు వెళ్లకుండా కాస్త శ్రద్ధతో ఎన్టీఆర్ స్క్రిప్ట్ చూస్తున్నాడు కాబట్టి కొంచెం లేట్ అయినా పర్లేదని అంటున్నారు.  కొరటాల శివ కూడా ఈ సబ్జెక్టు మీద చాలా నమ్మకంతో ఉన్నారు ఖచ్చితంగా తాను మళ్ళీ కంబ్యాక్ ఇస్తానని భావిస్తున్నారు. ఇక ఈ బ్యాక్ డ్రాప్ పూర్తిగా కొత్తగా ఉంటుందని ఎవరూ టచ్ చేయని విధంగా ఉంటుందని కొరటాల శివ సన్నిహితులు చెబుతున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎంత హిట్ కాబోతుందనేది. 

Also Read: Disha Patani New Boyriend: టైగర్ ను వదిలేసి కొత్త బాయ్ ఫ్రెండ్ తో దిశా చెట్టాల్ పట్టాల్.. అందాల ఆరబోతకు నో లిమిట్స్!

Also Read: Rajamouli : ఆ సినిమా తరహాలోనే మహేష్ బాబుతో మూవీ..అసలు విషయం బయటపెట్టిన జక్కన్న!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x