Parineeti Chopra: ప్రెగ్నెన్సీ వార్త వెనక కారణం అదే.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన పరిణితి చోప్రా

Parineeti Chopra Pregnancy:  పరిణితి చోప్రా.. తెలుగులో నటించకపోయిన ఆమె హిందీ సినిమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందుకే ఆమె అన్ని భాషల వారికి సుపరిచితురాలే. ఈ క్రమంలో ఈ హీరోయిన్ ప్రెగ్నెంట్ అని కొన్ని వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 29, 2024, 11:34 AM IST
Parineeti Chopra: ప్రెగ్నెన్సీ వార్త వెనక కారణం అదే.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన పరిణితి చోప్రా

Parineeti Chopra:

బాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ మోస్ట్ నటీమణుల్లో పరిణితి చోప్రా ఒకరు. తనన తన నటన.. అందం ద్వారా మంచి పేరు సంపాదించుకుంది ఈ హీరోయిన్. మొదట రెండు సినిమాల తోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ నటి .. కథ, తన పాత్ర బలం ఉన్న సినిమాలు మాత్రమే ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 

వరస అవకాశాలు అందుకుంటూ సినిమాల్లో తెగ బిజీగా ఉన్నప్పుడే ఈ హీరోయిన్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాను వివాహం చేసుకుంది. వీరిద్దరి వివాహం గత సంవత్సరం చివర్లో రాజస్థాన్‏లోని ఉదయ్‏పూర్‏లో రంగ రంగ వైభవంగా జరిగింది. పెళ్లి తర్వాత కొద్ది రోజులు సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది ఈ హీరోయిన్.

కాగా పెళ్లయిన ఇన్ని నెలలకు ఈ మధ్యనే చమ్కీలా చిత్రంతో రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైపోయింది. దిల్జీత్ దోసాంజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే నెల ఏప్రిల్ 12న రిలీజ్ చేయనున్నారు. అమర్ సింగ్ బయోపిక్‏గా వస్తున్న ఈ సినిమాలో పరిణితి కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతూ ఉండటంతో ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా కొనసాగిస్తున్నారు ఈ సినిమా యూనిట్. ఈ ప్రమోషనల్ ఈవెంట్స్ లో పరిణితి కూడా పాల్గొంటుంది.

కాగా ఈ మధ్య ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ కి ఈ హీరోయిన్ అటెండ్ కాగా ఆ ఈవెంట్లో పరిణితి డ్రెస్సింగ్ కాస్త విభిన్నంగా కనిపించింది. ఇక దాంతో ఎప్పటిలాగే ఆమె ప్రెగ్నెన్సీతో ఉందంటూ నెట్టింట ప్రచారం మొదలైంది. ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ వచ్చింది. అంతేకాకుండా ఈమధ్య ఎక్కువగా ఈ హీరోయిన్ తేలికైనా దుస్తులు ధరిస్తుందని.. ఆమె త్వరలోనే తల్లికాబోతుందంటూ కన్ఫామ్ చేసేసారు నేటిజన్స్. మరోపక్క దాదాపు అన్ని చమ్కీల ప్రమోషనల్ ఈవెంట్స్ కి కాఫ్తాన్ దుస్తులు.. సౌకర్యవంతగా ఉండేలా తేలికైనా కుర్తా ధరించి కనిపించింది ఈ నటి. దీంతో ప్రెగ్నెన్సీ రూమర్స్ తెగ చూడు అందుకున్నాయి. ఇక ఫైనల్ గా ఈ విషయంపై స్పందించింది పరిణితి.

“కఫ్తాన్ దుస్తులు = ప్రెగ్నెన్సీ, భారీ చొక్కా = ప్రెగ్నెన్సీ, సౌకర్యవంతమైన ఇండియన్ కుర్తా = ప్రెగ్నె్న్సీ” అంటూ నవ్వుతున్న ఎమోజీని జత చేసి తన ఇంస్టాగ్రామ్ లో స్టేటస్ షేర్ చేసింది. ఈ స్టేటస్ కాస్త ప్రస్తుతం తెగ వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటుంది. పరిణితి రూమర్స్ ప్రెస్ చేసే వాళ్ళకి బలే ఆన్సర్ ఇచ్చింది అంటూ కామెంట్లు పెడుతున్నారు ఆమె అభిమానులు.

Also Read: Nita Ambani Visited Balkampet Temple: బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో నీతా అంబానీ ప్రత్యేక పూజలు..

Also Read: అంగరంగ వైభవంగా బర్రెలక్క రెండో వివాహం.. తరలివచ్చిన సోషల్‌ మీడియా అతిథులు

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News